పుట:Andhrula Charitramu Part 2.pdf/68

ఈ పుట ఆమోదించబడ్డది

వలసియున్నది. ఇతడు ద్రావిడభాషాసారస్వతములోని గాథలలో నుదాహరింపబడినవాడు. ఇతడు కావేరినది కానకట్ట కట్టించి గట్లుపోయించెననియు, నితనితండ్రి జటచోడుడనియు, అతడయోధ్యను బాలించెననియు, దెలుగుచోడుల శాసనములందభివర్ణింపబడియెను. చాళుక్యవంశమునకు మూలపురుషుడయిన విజయాదిత్యుడయోధ్యను బాలించుచుండి దక్షిణాపథము నేలుచుండిన త్రిలోచనపల్లవునితో బోరాడినట్లుగ దూర్పుచాళుక్య చక్రవర్తుల శాసనములందు జెప్పబడినట్లుగనే, అయోధ్యను బరిపాలించుచుండిన జటచోడుని కుమారుడు కరికాలచోడుడు కాంచీపురము నేలుచుండిన త్రిలోచనపల్లవునితో బోరాడి కాంచీపురమును బరిపాలించినట్లు తెలుగు చోడులయొక్క కొన్ని శాసనములవలన దెలియుచున్నది. దీనింబట్టి చూడగా, చోడులు చాళుక్యుల గాథలను జూచి తమ గాథలను గల్పించినట్లు కన్పట్టుచున్నది. కరికాలునకు మహిమానుడను కుమారుడును, ఆతనికి గరికాలుడు, తొండమానుడు, దాసవర్మయను మూవురు కుమారులును గలరనియు శాసనములందు గన్పట్టుచున్నది. కరికాలుని వంశమున దెలుగు బిజ్జన జనించెను. ఇతని వంశమునుండి రెండుశాఖలుద్భవించినవి. దాసవర్మనుండి యొకశాఖ పుట్టెను.[1]

కొణిదెన చోడులు.

కరికాల వంశమున జనించిన దాసవర్మ మొదట పాకనాటి రాష్ట్రమును జయించి పొత్తపి పట్టణమును రాజధానిగ జేసికొని పరిపాలించెనని చెప్పబడియున్నది. పొత్తపియనునది కడప మండలమునందలి పుల్లంపేట తాలూకాలోని టంగుటూరునకు సమీపమునందున్న పోతపి యను గ్రామమే గాని వేరొండుగాదు. [2] ఈ పొత్తపి రాజధానిగా గల పొత్తపినాడును బరిపా

  1. Annual Report on Epigraphy for 1899. Nos. 188 & 205
  2. Annual Report on Epigraphy for 1907-08, Part II. paragraph 79.