ఈ పుట ఆమోదించబడ్డది

యుత్తరవాది యనుట లెస్సయగునే? అట్లే ఆంధ్రచిత్రప్రపంచంబునంగూడ ప్రాథమికోద్యమం బగునీగ్రంథరాజంబున నెరనులుండినయెడల నవ్వానిని బుధులు సంస్కరించిన నాంధ్రదేశంబునకు గ్రంథకర్తతోబాటు లాభము కలుగజేసినవారే యగుదురు. ఆ నమ్మకము మాకుగలదగుటను జేసి మేమీ మహాకార్యంబునకు గడగియున్నారము. ఆంధ్రచరిత్రాధ్యయన పరలెల్లరును మాకు సాయపడ బ్రార్థితులు.


గ్రంథకర్తగారు పీఠికలో దమ కీ సంపుటము రచించుటయందు గలిగిన ప్రోత్సాహనిరుత్సాహ కారణంబులను వ్రాసికొనియున్నారు. అవి యెల్లను ప్రస్తుతరచనకు సంబంధించిన వారి స్వవిషయంబులు.

వీరు ఆంధ్రులచరిత్రమును వ్రాయుటయందు బ్రథములగుట వలన వీరి యభిప్రాయములు గొందరకు సమ్మతములు గాకపోవచ్చును. కొన్ని సందర్భములనయ్యవి ప్రమాద జనితంబులయినను గావచ్చును. కాని ఏ విషయమును గురించియైనను, నుపక్రమించువారు సంపూర్ణముగ దమ హృదయంబును విప్పి చెప్పినంగాని చర్చనీయాంశంబులు వెల్లడియగుటలేదు. అందువలన వారికి గొంత స్వాతంత్ర్యంబిచ్చుట ధర్మమని తలచి మేము ఈ గ్రంథకర్తగారి యభిప్రాయములు విషయ