పుట:Andhrula Charitramu Part 2.pdf/411

ఈ పుటను అచ్చుదిద్దలేదు

యెందఱెందఱో పోరాడిరి గాని యందఱును రణభూమికి దేహములర్పించుకొని వీరస్వర్గమును జూఱ్గగొనవలసినవారయిరి. రాజ్యలక్ష్మి కాకతీయులను విడనాడిపోయెను. దైవబలము లేని వట్టిపౌరుషముతో నేమి ప్రయోజనము. శత్రువులు ప్రతాపరుద్రుని కుటుంబ సహితముగా కసరోఖాన్, ఖ్యాజాహాజీ, అను వారి వెంట డిల్లీనగరమునకు బంపెననియు అప్పటివారు పరమానంద మగ్నులై మహోత్సవము గావించిరనియు మహమ్మదీయ చరిత్రకారులు కొందఱు వ్రాసి యున్నారు. కాని యదియంతగా విశ్వసింపదగినదిగా గనబడదు. ఏకశిలానగరము మహమ్మదీయుల వసమయ్యెను. అమ్మహానగరము నకు సులతాపురమని ఆలూఫఖాను పేరుపెట్టను. ప్రతాపరుద్రుని చెఱనుండి డిల్లీచక్రవర్తి విడిపించెనని మహమ్మదీయ చరిత్రకారులు వ్రాసియుండలేదు. గాని హిందువులగాధలుమాత్రము ప్రతాపరుద్రుడు కారాగాగృహవిముక్తుడై వచ్చి గోదావరీతీరమున దపస్సు చేసి కొనుచుండి మరణము జెందెనని చెప్పుచున్నవి. ఈతని కారావిమోచనమును గూర్చి యొకచిత్రమైన కధ కలదు. ప్రతాపరుద్రుని బ్రాహ్మణ మంత్రియగు యుగంధరుడను వాడు పిచ్చివాని వేషమును ధరించి డిల్లీ నగరమున విహరించుచు చక్రవర్తిని మాయజేసి ప్రతాపరుద్రుని విడిపించుకొని వచ్చెనని చెప్పుదురు. కాని యిదియును విశ్వాసపాత్రమైనది కాదు. ఎందులకన మారనకవి తన మర్కండేయౌరాణమున గృతిపతియైన నాగయగన్నమంత్రిని నీతికి యుగంధరునివంటివాడని యభివర్ణించియుండెను. కనుక యుగంధరు డనువాడెవ్వడో ప్రతాపరుద్రునకు బూర్వమునందే ప్రసిద్ధికలిగి యుందవలయున్. కాబట్టి యాకధ కవికల్పనమై యుండును. బ్రతాపరుద్రుని సేనానాయకులలో నొక్కడగు రేచెర్లసింగమనాయని పుత్రుడు అనపోతానాయుడు క్రీ.శ.1535 దవ సంవత్సరములో అయ్యనవ్రోలు దేవస్థానములో వ్రాయించిన శిలాశాసనములో "రాయబందీవిమోచక" యను బిరుదము వహించినటులు