పుట:Andhrula Charitramu Part 2.pdf/41

ఈ పుట ఆమోదించబడ్డది

4

                            ఆంధ్రులచరిత్రము.

మని వచించియు, బౌద్ధులను బెక్కండ్రను పౌరాణిక హిందూమతావలంబకులనుగ జేసెనని చెప్పుదురు. ఇతడు పౌరాణికమతముతో జాలవరకు సమాధానపడి తన మతమును మెల్లమెల్లగ వ్యాపింపజేసి కృతకృత్యుడయ్యెను. ఇతడు రాజాధిరాజులను వశులనుగ జేసికొని బౌద్ధులను హింసించెనని చెప్పెడి కథలెంతవరకు విశ్వసనీయములో మనమిప్పుడు నిర్ధారణ చేయజాలముగాని, హిందూదేశనమున బౌద్ధమత వినాశనమునకు గొంతవరకీతడు కారణభూతుడై యుండవచ్చునని మాత్రము మనమూహింపవచ్చును. ఇతడు కుమారిలభట్టు బోధించిన వైదికమతమునుగూడ నిరసించినవాడు. ఈ మహాసంస్కర్త ముప్పదిరెండు సంవత్సరములు జీవించి బదరీకేదారములో ముక్తిగాంచెనని చెప్పుదురు. ఇతడు బోధించిన యద్వైత తత్త్వమును వైదికమతావలంబకులయిన బ్రాహ్మణులనేకు లంగీకరించిరి. పదునొకండవ శతాబ్దాంతమునను పండ్రెడవ శతాబ్ద ప్రారంభమునను యాదవ ప్రకాశులను నద్వైతసన్న్యాసి యొకడు కాంచీనగరమునందు నద్వైత మతబోధనలను గావించుచు మహాప్రఖ్యాతి గాంచుచుండెను.

కాంచీనగరము.

అంతకుబూర్వము జైనబౌద్ధమతాచార్యులకు సయితము ప్రధాన స్థలముగా నుండిన యీ కాంచీనగరము, పదనొకండవ శతాబ్దమునాటికి బ్రాహ్మణాధీనమై వైదిక విద్యాబోధక స్థానమై, బ్రాహ్మణ మతములకు బట్టుకొమ్మయై, దక్షిణ హిందూదేశమున విద్యాధికార స్థానమును వహించిన నగరములనన్నింటి నతిశయించి యొప్పారుచుండుటచేత నెక్కడెక్కడనుండియో బ్రాహ్మణవిద్యార్థులనేకులు విచ్చేసి ప్రసిద్ధులయిన యపాధ్యాయుల కడ విద్యాభ్యాసమును జేయుచు వేదవేదాంతాది విద్యారహస్యముల నేర్చుకొనుచుండిరి. మతబోధకులనేకులా మహానగరమునకు నేతెంచి నేర్పుమీర మతబోధనలు గావించుచుండిరి. అట్టివారిలో యాదవ ప్రకాశులను సన్న్యాసియునొకడు. ఇతని ప్రసిద్ధి విని దూరస్థలములనుండి విద్యార్థులనేకులు వచ్చి