పుట:Andhrula Charitramu Part 2.pdf/394

ఈ పుటను అచ్చుదిద్దలేదు

జాలక వెనుదీసిరి. హిందూసైనికులు వారిని సరిహద్దులను దాటువఱకు దఱుముచునే యుండిరి. ఈదండయాత్రయందు మహమ్మదీయసైన్యము విశేషముగా నష్ట మయ్యెను. కలిక్ కాఫర్ సంపూర్ణముగా పరాభూతుడ ఢిలీకి బాఱిపొవలసినడా డయ్యెను. హిందువులవలన గలిగిన పరిభవమె మలిక్ కాఫర్ హృదయమునకు శూలమై నాటి యెప్పటికైనను బగతీర్చుకొనవలయునన్న సంకల్ప మాతనికి యిట్టించెను. అట్టియదనుకై కలిక్ కాఫర్ నిరీక్షించుచుండెను.

మలిక్ కాఫుర్ ద్వితీయదండయాత్ర.

  ఇట్లాంధ్రులు విజయము గంచుటకును, మహమ్మదీయులు పరాజితులగుటకును నత్యాశ్చర్యమును జెంది సేవణదేశమును బాలించు రామచంద్రదేవువు ఢిల్లీచక్రవర్తికి గప్పముగట్టుట మానుకొనియెను. ఇయ్యది ఢిల్లీ చక్రవర్తి యాగ్రహమునకు బాత్రుని గావించెను.  మహారాష్ట్ర త్రిలింగదేశములను జయించుటకై అల్లాఉద్దీను చక్రవర్తి ముప్పదివేల గుఱ్ఱపుదళమును లక్ష కాల్బలము నిచ్చి మలిక్ కాఫురును క్రీ.శ.1307  వ సంవత్సరము మార్చి నెల లో మరల బంపెను. ఇట్టి మహాసైన్యముతోడ మలిక్ కాఫుర్ దేవగిరికి వచ్చి దేవగిరిదుర్గమును ముట్టడింపగానే యామహాసైన్యము నెదిరించుట కష్ట మని రామాంద్రదేవుడు వారికి లోబడియెను. అంతట మలిక్ కాఫుర్ సంతొషితస్వాంతు డై రామచంద్రదేవుని ఢిలీకి పంపించి తా నా దేశమున్ విడిచి యేకశిలానగముపై దండేత్తివచ్చెను. ఈరెండవసారియు మహమ్మదీయుల ను నాంధ్రులకు మహాఘోరాహవము వాటిల్లెను.  ఈయుద్ధమునందు ఆంధ్ర భటులు వేనవేలు హతులైరి. కాని విజయము మరల నాంధ్రులకే సంప్రాప్తమయ్యెను.  మలిక్ కాఫుర్ పరాజితుడై ఢిలీకి బాఱిపొయెను. ఆఱుమాసములకు బిమ్మట రామచంద్ర దేవుడు ఢిలీచక్రవర్తిచే నర్హసత్కారములను బొంది చెఱనుండి విముక్తి గాంచెను.  నాటునుండి ఢిల్లీచక్రవర్తికి విశ్వాసపూ