పుట:Andhrula Charitramu Part 2.pdf/386

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూటకూళ్లయిండ్లు గల వని కూడ పైపద్యమువలన బోధపడుచున్నది. ఆకాలమున నొక్కరూకకు వడ్డించు భొఝాణాఫదర్దములును గూడ కవి యీ విధముగా నభివర్ణించియున్నాడు.

"ఉ. కప్పగభోగివంటకము కమ్మని గోధుమపిడివంటయున్
     గుప్పెడు పంచదారయును గ్రొత్తగ గాచిన యాలనే సెస
     గ్నప్పును గొమ్మునల్లవటిపండ్లును నాలుగు సైడు నంజులున్
    లప్పులతోడ గ్రొంబెరుగు లక్షమణ యొజ్జల యింటిరూకకున్."

   పూటకూళ్లు పెట్టు నిప్పటియిండ్లవలెనే యాకాలమునాటి పూటకూటి యిండ్లను దుర్వినీతికి బట్టుకొమ్మలై యుండెనని చెప్పియున్నాడు.

"ఓ. సందివిగ్రహయానాది పర్యాటకుటువల
     బంధకీజారులకు రాయబారి యగుచు
    పట్టనంబున నిత్యము పగలు రేయి
    పూటకూటిట వర్తించు బుష్పకరుడు."

మాచల్దేవివారాంగన

  అగ్నిసాక్షికంగా వివాహముజేసికొన్న దేవులు గాక పూర్ఫరాజులు భోగకాంతుల నుంపుదుకత్తెలను గా బెట్టుకొనెడు నాచార మానాఢు గలదు. ఆయాచారమును ప్రతాపరుద్రచక్రవర్తి కూద నవలంభిచి యుండెను. అతని యుంపుడుగత్తెలలో మాచల్దేవి యనువారాంగన విశేప్రసిద్ధి కలది. ఈమె నుధిరమును గాంచి యచ్చెరు వందుచు మంచన గోవిందశర్మ ప్రక్కనున్న వారిని ప్రశ్నించినప్పుడు వార లీక్రిందివిధముగా బ్రత్యుత్తత మిచ్చి రని క్రీడాభిరామమున జెప్పబదియెను.

"శా. ద్వీపాంతంబున నుండి వచ్చితివె భూదేవా, ప్రశాంతం మహా
      పాపం, సర్వజగత్ప్రసిద్ధ సుమనోబాణాసనామ్యాయ వి