పుట:Andhrula Charitramu Part 2.pdf/385

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మఱియు నామహాకవి వారు ధరించికొన్న యాలంకారములతో గూడ వీరకుమారకోటి ని ట్లభివర్ణించియున్నాడు.

"ఉ. పచ్చని పిండిగంధమును బాలము సేసయునెఱ్ఱుపూవులం
     గ్రుచ్చిన కంఠమాల్యములు గుప్పగనల్గిన వేణిజంధముల్
     కుచ్చుల వీరపంచెటయు గ్రొత్తమణులు గగు కాసెపుట్టమున్
     బచ్చలు చెక్కినట్టిరవణంబ్లు వీర కుమారకోటికిన్."

ఘటికాయంత్రం, పూటకూళ్లు

    కాకతీయప్రతాపరుద్రుడు పరిపాలనము చేయునప్పుడు కాలపరిమాణముం దెలుపునట్టి ఘటికాయంత్రములు గల వనియు వానిం బట్టి గంటలు కొట్టబడుచుండు ననియు క్రీడాభిరామములో గల యీ క్రిందిపద్యమువలన దెలియుచున్నది.

"మ.ఉదంవీధిన శిఖరావలంబిఆగు సంధ్రోర్వీశు మోసాలపై
      గడియారంబున మ్రోసె రెండెనిమిచుల్ ఘంటాఘణాత్కారముల్
      స్దలెన్ భానుదు పశ్చిమంబునకు వైశ్యాపూటకూటింటికిన్
      గుడువం బోదమె లెక్క యిచ్చి కడువా కొన్నార ముప్పట్టునన్."

  అని మంచనగొవిందశర్మ యను బ్రాహ్మణుదు తనదెలికాడకు కోమటి టిట్టేభపెట్టితో బలికినట్లు వ్రాయడియుండుటం జేసి యాకాలమున గూడ కాలపరిమానముం దెలిపెడు గడియారములు కలవని తెల్లమగుచున్నది. కాని యాగడియారములు ఇప్పటి గడియారమువంటివింగాక మఱియొక విధ మైనవి గా మనము గ్రహింపవలయును.  అప్పుడు గడిఅలను బట్టి గంతలు కొట్టుచుండెను. అట్లుగుటాచేతనే యాంధ్రోర్వీశుమొసాల రెండెనిమిదులు (16) మ్రోగెనని చెప్పబడియెను.  ఈకాలమునందలి నగరములలొ బలెనే యాకాలమునందును సొమ్ముతీసికొనిభోజనము పెట్టునట్టి