పుట:Andhrula Charitramu Part 2.pdf/384

ఈ పుటను అచ్చుదిద్దలేదు

జనసామాన్యము వీరులను పేరితో గుళ్లు కట్టి యారాధించుచుండెను. ఇట్లా రాధింపబడు వీరపురుషులయొక్క విగ్రహము లాంద్రదేశమునం దంటను గలవు. అందుకు ముఖ్యముగా పల్నాటివీరుల యాలయము లాయేకశిలానగరము నందు ప్రసిద్ధ మైనవిగ నుండెను. అప్పటికి పల్నాటివీరుల చరిత్రము ద్విపద ప్రబంధముగ రచింపబడి దేశమునం దంతట బఠింపబడుచుండెను. ఈప్రబంధమును పాడునపుడు వీరపురుషుల శౌర్యప్రతాపములు బ్రకటించు నభి నయాదికృత్యము లీక్రిందివిధముగా క్రీడాభిరామమున నభిఫర్ణింపబడియెను.

"మ. ద్రుతతాళంబున ఫ్వీరగంభితకధం దుంధుంకిటాత్కారసం
       గతి వాయింపుచు నాంతరాలిక యతీగ్రామాభిరామంబుగా
       యతిగూడం ద్విపదప్రబంధమున వీరానీకముం బాడె నొ
      క్కత ప్రత్యేకముగా గుమారకులు ఫీట్కారంబునం దూలంగన్.
  గీ. గర్జించి యరసి జంఘాకాండయుగళంబు
       వీరసంబెట కోల వ్రేయు నొకడు
     ఆలీపాదవిన్యాస మొప్పంగ వ్రాలి
        కుంతాభినయం గైకొను నొకండు
     బిగువు గన్నుల నుబ్బు బెదరుచూపులతొడ
        ఫీట్కార మొనరించు బెలుద నొకడు
     పటుభుజావష్టంభ పరిపాటి ఘటియుఇల్ల
       ధరణి యాస్ఫోతించి దాటు నొకడు.
తే. ఉర్దిప్రకటింప నొక్కడు డోలవాడు
    బయల గుఱ్ఱంబు భంజళి బఱపు నొకదు
    కుడుము దాటించుచును బెద్దకొలువులోను
    బడతి పల్నాటివీరుల బాడు నపుడు."