పుట:Andhrula Charitramu Part 2.pdf/365

ఈ పుటను అచ్చుదిద్దలేదు

"సీ. తన సుందరాకృతి గని వెఱ గందిన
          వనిత లంకరజు మెప్పు దనువు జేయ
     దన కళాచరురిత్వమున కద్భుతం బందు
          బుధులు భోజుని నేర్పు పొల్లు సేయ
     దననయాభిలజ్ఞత వినినప్రాజ్ఞులు దివి
          జేసుని తజ్ జ్ఞత యేపు రింప
     దనయాశ్రయంబున మను బంధు మిత్త్ర వ
         ర్గము కల్పతరువు నాశ్రయము దెగడ
గీ. నెగడి జరమున నెంతయుబొగడునడసె
        గాకతిక్ష్మాతలాధీశకటకపాలు
    దమలసితకీర్తి ధనలోలు డన్వాఅబ్జ
       షండ దినవల్లభుడు గన్న సైన్యవిభుడు."

   ఇతడు ప్రతాపరుద్రకటాక్షాపేక్షపరాక్రమప్రకారుం డగుటయు గాక విద్యావిబూషణుం డగుటవలన శ్రుతి స్మృత్ సంపన్నులయిన భూసురోత్తములును, సమస్తశస్త్రవిదులయిన విద్వాంసులును, అఖిలపురాణ ప్రవీణు లయిన పౌరాణికులును, సరససాహిత్య విద్యావిశారదు లయిన కవి నతంసులును, తిన్న్ బరివేస్టింప నప్పటప్పట రమ్యహర్మ్య్హతలంబుల సుఖోప విష్ణుండై సరసకధా వినోదంబుల గాలంబుగడపుచుండెను. ఇట్లు నిర్వజ్జనానుగ్రహంబు బడసిన యాగన్నమంత్రి తిక్కనసోమయాజి శిష్యుండయిన మారయకవివర్యునిచే మార్కండేయపురాణమున్ దెనిగింప జేసి యేతత్కృతికి నాహకుండయ్యెను.  ఈనగయ గన్నవిభుడు ప్రతాపరుద్ర దేవసామ్రాజ్యవర్దనస్ధిరవినీతికరణకుశలుండని మారనకవి యీ క్రించిపద్యములో జెప్పటయె యీ మంత్రిశిఖామణియొక్క ప్రతిభావిశేషమును వేనోళ్ల జాటుచున్నది.