పుట:Andhrula Charitramu Part 2.pdf/357

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధెమంతు ల్సుతు లుద్భవించి రొగి,గౌంతేయ ప్రభానోన్నతుల్
రామప్రఖ్యులు వహ్నితేజాలు జగత్ప్రఖ్యాత శౌర్యోదయుల్."

ప్రతాపరుద్ర చక్రవర్తి జననము

   కాకతి రుద్రదేవికి ముక్కక్క లేక ముమ్మడమ్మ, రుయ్యామ్మ అను నిరువురు కూతులు గలరు ముమ్మడక్క చాళుక్యవంశోద్భవుం డైన వీరభద్రరాజున కిచ్చి వివాహము చేయబడియె నని స్థానిక చరిత్రమునం బట్టి దెలియుచున్నది గాని ముమ్మడమ్మభర్తయొక్క చరిత్రము లేశమాత్రం దెలియరాకున్నది.  రెండవకుమార్తె యగు రుయ్యమ్మను ఇందులూరి అన్నదేవభూపాలుని కిచ్చి వివాహము చేసినట్లు, ఇందులూరి వారి వంశచరిత్రమును బట్టి దెలిబుచున్నది. ఈ రాజకుమారు లిరువురును రుద్రదేవి చక్రవర్తినికి లోబడిన సామంతమాండలిక ప్రభువు అయి యుండవలయును.  ముమ్మడమ్మకు నిరువురు పుత్రులు జనించిరి. మొదటి పుత్రుని నామము ప్రతాపరుద్రదేవుడు. రెండవ పుత్రునిపేరు అన్నమదేవుడు. రుయమ్మకు సంతానము లేదు. ప్రతాపరుద్రు డెప్పుడు అన్నదేవుడు జనించెనో మనకు సరిగా దెలియదు. శా.శ.1166  నది యగు వందవ సంవత్సర చైత్రశుద్ధ పంచమీ గురువారమునాడు రోహిణీనక్షత్ర్రమున బ్రాహ్మానీమొహూర్తమున సూర్యాంగరక బృహస్పతు లుచ్చస్థానగతులై శని నిజస్థానంబున  మంద ముమ్మడమ్మ గర్భమునుండి ప్రతాపరుద్రుడు జనించె నని స్థానికచరిత్రమునందు జెప్పబడిందిగాని యది సరియైనదిగా గన్పట్టదు. కాకతి గణపతి చక్రవర్తి క్రీ.శ. 1260 వఱకు జీవించియుండి పరిపాలనము చేసినట్లు శాసనములు వేనోళ్ల జాటుచున్నవి. ప్రతాఅరుద్రుడు స్థానిక చరిత్రమును జెప్పబడినట్లు క్రీ.శ.1244 గవ  సంవత్సరమున జనన మందినది సత్యమగునేని గనపతి చక్రవర్తి మరణకాలము నాటికి 16 సంవత్సరములు వయస్సుగలవాడై యుండవలయును కదా! అట్టిసందర్భమునందున రాజ్యమునకు ప్రతాపరుద్రునికి దానేపట్టము గట్టి యుండును. అతడు పట్టము గట్టక యున్నను రుద్రమదేవి యైనను ప్రతాప