పుట:Andhrula Charitramu Part 2.pdf/354

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నసఘాత్మయగుచున్న యన్నమాంబికకు
దనయుండు బుద్ధాభిదానుండు ననుప
నారయ మత్స్యకూర్మాది దివ్యాన
తారంబులం దెల్ల దలంచి చూడంగ
రామావతారంబు రమణీయ మగుట
రాముపావనచరిత్రము దివ్యభాష
లోకానురంజన శ్లోకబంధముల
జెకొని వాల్మీకి చెప్పినజాడ
మాతండ్రి బుద్ధక్షమానాధు పేర
నాతతంరకైరవాప్తుని పేర
ఘనుడు మీసరగండ కాచవిభుండు
వినుతశీలుండు పినవితల భూపతియు
నని జనుల్" మమౌ గొనియాడగ మేము
వినుత నూతన పద ద్విపదరూపముం
బ్రాకటంబుగ నాంధ్రభాషను జెప్ప
గైగొన్నయుత్తరకధ యెట్టి దనిన"

    అని వ్రాసియున్నారు. రంగనాధరామాయణములో బుద్ధభూవిభుని తండ్రి వికలధరణీశు డనియు, ఉత్తరరామాయణంళొ బుద్ధారెడ్డి తండ్రి గన్నారెడ్డి యనియుజెప్పబడియుండుటచేత నొండొరులకు గలసంబంధమునును దెలిసికొనుటలో గష్ట మెక్కువ యగుచున్నది. పై రాచూరు శాసనములో బేర్కొనంబడిన గోనగన్నారెడ్దియును, వితలనాధుడును రంగనాధ రామాయనములోను ఉత్తరరామాయణంలొను బేర్కొనబడిన వికలధరణీశుడును గన్నక్షితీంద్రుడా వికలనాధుదా యనునది సందిగ్దముగా నున్నది. రాచూరు శాసనము బ్రకటించిన శ్రీమానవల్లిరామకృష్ణయ్య, ఎం.ఏ గారు గోనగన్నయ్య రెడ్డియు, వికలనాధుడునుజ్ సోదరు లనియు, పినతండ్రి పెదతండ్రులను గూడ