పుట:Andhrula Charitramu Part 2.pdf/351

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోనగన్నారెడ్డిసాహిణి

   కాకతి రుద్రమదేవి సైన్య్హాధిపతులలో నొక్కడగు గోనగన్నయసాహిణి వర్ధమానపురము రాజధానిగా నాంధ్రసామ్రాజ్యముయొక్క పశ్చిమభాగము కంతయు నధికారియై పరిపాలనము సేయుచు నామెకు దక్షిణ భుజమై యొప్పియుండెను.  ఈగోనగన్నారెడ్డికి విఠలనాధుడు సేనాపతిగా నుండెను. ఇతడు సర్వరాష్ట్ర సమస్తప్రజారక్షణార్ధమై రాచూరుదుర్గమును శా.శ.1216 (1284) సంవత్సర మార్గశీర్షశుద్ధ సప్తమినాడు నిర్మించెనని యాదుర్గముపై నొక గోడమీద లిఖింపబడిన శాసనమువలన దెలియుచున్నది.  ఆశాసనములో గోనగన్నారెడ్డి సమస్త గుణగణాకరుం డనియు సత్యరత్నాకరుండనియు సౌజన్యగౌరవుండనియు, అరిగండ భైరవుండనియు సాహసోత్తుంగు డనియు, కాకతీయ కటక సన్నాహుడనియు, వీరివితరణోత్సాహుడనియు, కుడుపులూరి పురివరాధీశ్వరుండనియు, వీరలక్ష్మీవిజేశ్వరుండనియు, మనుక కుల కమల మార్తాండు డనియ్హు, కదనప్రచండుడనియు, మీసిరగండ డనియు, ఉభయంబలగండడనియు, గండరగండడనియు, అధింగ గండభేరుండనియు, హన్నిబృరగండడనియు, హదిమువ్వరగండ డనియు, లాడకువర పెండారు డనియు, చోలజగజాశవీరకాంతికాఱుం డనియు, గళమౌళియనియు, సంతతార్చిత శశిమౌళి యనియు, కామినీజయంతుం డనియు, దుష్టతురగరేఖా రేవంతు డనియు, సమరిసమయుండనియు, దుర్వారెవీరావతారుం డనియు, కోసగిమైలి తలగొండుగం డనియు,అక్కినాయకుని తలగొండుగం డనియు, మేడిపలికాచయనాకురిశిరశుండనియు, కందుకూరికేశినాయని తలగొండుగం డనియు, ఱాపాకభీమనిర్దూమధాముం డనియు, నిరుపమసంగ్రామ రాముండనియు, తెఱాలకాటరిశాపట్టనియు ఏఱునతొండగోధూమఘట్టనధుర ట్టనియు, బేడ చెలుకినాయని నిస్సాహణాపహరిణుండనియు, సహజకార్యభరణుండనియు, కోటపర్మాడిరాయ కంఠాభరణ చూఱకొఱుండనియు, చోడోడయ పట్టమాత్ర తురంగాపహారుం డనియూ, రుద్రదేవ దక్షిణ భుజ