పుట:Andhrula Charitramu Part 2.pdf/337

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంధకర్తలు పరమవిశ్వాసభావముతో నంగీకరించిన సిద్ధాంతమును ద్రోచి పుచ్చుటకు హేతువు లేవి యని చదువరులు ప్రశ్నించవచ్చును. రుద్రాంబిక గణపతికూతు రని చెప్పుటకు వలవత్తర మయిన ప్రమాణముగలదు. వానిం దెలుపుటక్ బూర్వము పై నుదాహరించిన యభిప్రాయమున్ గూర్చి యెకింత విమర్శ చేయవలసి యున్నది. ఆయభిప్రాయములలో నొక్క ప్రతాపరుద్రీయ వ్యాఖ్యాత యభిప్రాయమును విమర్శించిన పక్షమున దక్కిన నన్నియు విమర్శింప నక్కరలేకయె మనకు సత్యము గొచరంకాగలదు. ఏకారణముచేత నట్లు వ్రాస్దినను ఈ సందర్బౌన వ్యాఖ్యాతవిభ్రాంత నొందె ననుటకు సందియము లేదు.

   విద్యానాధమహాకవిప్రణీతమైన ప్రతాపరుద్రీయమును బరిశోధించి రుద్రాంబిక గణపతిదేవుని కొమార్త యని మొదట కనిపెట్తినవారు శాసనపరిశోధకు డైన "హల్ ట్జు" అను జర్మనీ దేశపండితుడు.  ఈయన క్రీ.శ.1892వ సంవత్సరము జూలై నెల సంచిక "ఇండియన్ ఆంటిన్వెరీ" అను గ్రంధములో 198 వ పేజీలో కాంచీపురములో గణపతిదేవుని కాలమున వ్రాయబడిన దానశాసనము నొకదానిని బ్రకటించుచు, అందు గణపతికి వెనక రాజ్యమునకు వచ్చిన వారిని నిర్ధారణసేయుచు, ఈక్రిందిరీతిని వ్రాసి యున్నాడు.
        "ఆమెతండ్రి గణపతిపుత్రసంతానము లెనివాడయినందున నామెకు (రుద్రాంబిక) కుమారునిగానే బేర్కొని రుద్రు డని పురుష నామమును బెట్టెను. అతని మరణానంతరము ఆమె సింహాసన మెక్కినట్టు గాన్పించుచున్నది. ఆమె "రాజు రుద్రంహారాజు" అని మూలగ్రంధములో బేర్కొనబడి యుండగా  వ్యాఖ్యానములో రుద్రాంబిక యని పేర్కొన బడియెను.
   ప్రతాపరుద్రీయములో నాటకప్రకరణములో నొకచోట:-

"శ్లో. నైవోమా చేతి నిర్ధిష్టా సోమా దతి బ్రధా మగాత్
      తన మాతా శివా సాక్షా ర్దేవొ గణపతి, పితా."