పుట:Andhrula Charitramu Part 2.pdf/330

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేకచ్చత్రముక్రిందికి గొనివచ్చిల్న తరువాత నీతడు రాజ్యాంగమును, రాజధానీ నగరమును, దుర్గమును, సైన్యమును బలపఱచుటకై భగీరధప్రయత్నములు గావించెను. ఆకాలమున నాంధ్రసామ్రాజ్యము ఢిల్లీచక్రవర్తులకు మోహమును గలిగించు చుండెను. చంధ్రధ్వజు లయిన తురుష్కులకు భయంకరముగ వర్ధిల్లు చు వారలకు మత్సరపూరితులను గావించు చుండెను. దుర్గములోపలి రాజభవనమునకు జుట్టును ఉన్నత మైన శిలాప్రాకారమును, దానిచుట్టును మిక్కిలి యగధమై జలపూరిత మైన యగడ్తనుఇ నిర్మింపించుటయే గాక ప్రాకారమునకు లోపల రాజవీధుల నేర్పఱచి యచ్చటచ్చట నశ్వ రధ గజపదాతి వర్గంబుల బెట్టించి, అహోరాత్రములు వీరభటులశ్వారూఢులై రాజదానీక్షుణతత్సరులై విహరించునటుల నియమించి, ఉన్నతములై సుందరము లైన రాజభవనములను గోపురములను బెక్కింటిని గట్టించి గోపురముల బసిడికుండలతో నలంకరింపజెసి, ఏకశిలానగరమున కెంతో శోభను గల్పించెను. ఇతడు తనరాజ్యమునందంట నూర్లకొలది శివాలయములను సంస్థాపించెను. గణపవరంబు అని తనపేరిట నూర్లకొలది గ్రామంబులను నెల ల్పుటయె గాన త్రాగ శుద్ధజలము లభింపక ప్రజలు కస్తిపడుచున్న ప్రదేశముల ననేక తటాకములను ద్వవ్వించెను. దుర్గమంబు లైన యరణ్యప్రదేశంబుల మంచి బాటలను వేయించుటయే గాక యక్కదక్కడ సత్రములను చలిపందిరులను గట్టించుచు వచ్చెనను. తనరాజ్యములోనిప్రజలకు దేవభక్తి;యును పాపభీతియు గలుగునటుల బోధింపించుచు వచ్చెను. ప్రజల మానధనంబులకు భంగమును గలిగించునట్టి జార చోరాది క్రూర జనంబుల శిక్షింపించుచు మిక్కిలి జాగరూకుడై పరిపాలనము సెయుచు వచ్చెను. ఈ యాంధ్రచక్రవర్తికాలమ్న విదేశములతోడి వాణిజ్యమును సముద్రయానమును విశేషముగా సాగుచు వచ్చెను.

వేలానగరము ప్రసిద్ధమైన రేవుపట్టణము.

   ప్రాచీనకాలమునుండియు గుంటూరుమండలములో బాపట్లతాలూకాలో బాపట్లకు సమీపమున సముద్రతీరమునందున్న మోటుపల్లి యను