పుట:Andhrula Charitramu Part 2.pdf/317

ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్పష్టముగా గానంబడుచున్నది. అం దొకటి మల్యాలగూడెయ దండనాధుని భార్యయు, గొనబుద్ధారెడ్డికూతురు నగు కుప్పాంబయొక్క వర్ధమానపుర దాన శాసనము.1 దానిలొ

   "అసృజ చ్చతురో వర్ణాన్ ముఖబాహూససాదతి:
    అన్యా న్యుచ్చానచాదీని భూతాని స్థానరాణిని,
  "అధ సీకృతవర్ణోక్త ధర్మనిర్మలచేతస:
    జాతాన్ ద్విజాతయ: పశ్చా చ్చర్ర్జకులముజ్జ్వలం"
  "త త్రానెక నృపాల ఫాల లిఖితాం వీరాంకవర్ణౌనళిం
    దర్శిందర్శి మనర్గళం సమదరి త్తీవ్ర: ప్రతాపనల:
    య స్యోదంచిత కాకతీశ్వరకుల క్షీరాబ్ధి సంవర్ధన
   ప్రౌఢాహంకృతి చంద్రమా స్పనుభవ త్ప్తోలాభిధామో నృపం."
అనియు, మఱియు నామెయొక్క బూదవూరు (భూతపురి) శాసనములో
   "తేషా మమేయమహిమా మహితే
     వర్ణాశ్రయ: ప్రసరభూమి రతిప్రవృద్ధ:
     శుద్ధోzభవ త్సమధికం చ(తు) (రి) X ర్ణవానాం
     దిగ్ధాల్ధిన త్పురుషరత్నగుణై రు. . . . . . . . .
     ప్రశస్తి మప్తిత త్రాపి కాకతీయకులం. . . . . . . "

అనియు వ్రాయబడియున్నది. ఇంతియ గాక కాకతీయరాజులు చతుర్ధాన్వయు లయిన కమ్మనాటి వెలనాటి రాజులతో సంబంధములు చేయుచుండెడి వారని పూర్వప్రకరణముల ననేకదృష్టాంతముల శాసనములనుంది యెత్తి చూపించి యున్నాను. కాబట్టి కాకతీయులతొడి సహపంక్తిభోజనము దొరకిన మాత్రముచేత వీరలు తక్కిన వెలమ మక్కరాజుల వారికన్న గులాధిక్యము గలవారని చెప్పుటకు గారణ మగపడదు గదా! పద్మనాయకులు చెప్పుకొని పైగాధను బట్టి వీరలకు బ్రతాపరుద్రునికి బూర్వము వానితో సహ


1. ఈ శాసనముయొక్క ప్రతియును దీనిక్రింది శాసనముయొక్క, ప్రతియును శ్రీయుత నూకపల్లి రామకృష్ణకవి ఎం. ఏ గారిచే నిటీవల నొసంగబడినది.