పుట:Andhrula Charitramu Part 2.pdf/309

ఈ పుటను అచ్చుదిద్దలేదు

"ఆంధ్రేశరాజ్య రక్షగుణ(రాదగుడి?) ర్విరోధివనిదాన:
 రెడ్డికులకాలపల్లవరాయ ఇతి ప్రాపయశోఖ్యా:"

అని రెడ్డికులమునకు యమునివంటి వాడయిన పల్లవరాయ డని చెప్పబడి యుండుటచేత స్పష్ట మగుచున్నది. పూర్వరకరణమున దుర్ఝయ వంశరాజు లయిన వారిని కమ్మనాటిరెడ్లనుగా బేర్కొనియున్న విషయము పైశ్లోకములోని వాక్యములు పూర్వపక్షమును జేయుచున్న వని స్థూలదృష్టికి 'గానంబడ వచ్చును. గాని విమర్శదృష్టితో జూచిన పక్షమున నట్టి సందేహము గలుగనేరదు. కమ్మనాటిలో పల్లవులు, కదంబులు, ఛాళుక్యులు, రాష్ట్రకూటులు, చోడులు, గాంగులు, మాతంగులు, మౌర్యులు మొదలగువారు కొన్ని శతాబ్దములు నివసించి యుండుటచేత వారెల్లరును కమ్మవా రని వ్యవహరింపబడుచు వఛ్ఛు టచేతను, వీరిలో రెడ్డికులమునకు సంబందించినవారలు రెడ్డియను బిరుదవాచక పదమును నామాంతముల జేర్చుకొనుచు వచ్చుటచేతను, చదువరులకు సులబముగా బోధపడుటకై కమ్మనాటి రెడ్లని తెలుగుగనాటి రెడ్లని పూర్వప్రకరణ ములో బేర్కొని యున్నాడను. వేఱ్వేఱు తెగలవారు రెడ్ది, వెలమ, కమ్మ తగలలో చేరుటచేత నీమూడు తెగలలోను ననేకశాఖా భేరము లేర్పడుటకు గారణ మయ్యెను. అట్తిభేదముల నన్నింటినిగూర్చి కేవలము సాంఘిక చరిత్రమున జర్చింపవలసినడే గాని యిచ్చట జర్చీపసాధ్యపదు. పయి నుదాహరింపబడిన రాజరాజు ముదనూరు శాసనములోనే:-

      "చరుర్ధవంశప్రభవా? స్త్రయోధ
        శ్శంభుం సమారాధ్య తపోz భిరామ:
        ధాత్రీపతిత్వం (భువి?) దుర్జయత్విర
       వర్మాంతనామాపి నరేర్ద్రచిహ్నం " :

    అని నరేంద్రచిహ్న మైన వర్మబిరుదమును వామాంతరమున వహించెడి వారని చెప్పియుండుటచేత బైని బేర్కొనంబడిన పండితుల యభిప్రాయములు సరియైన వెమొనని తోచకపోదు.  మఱియు నామాంతరముల వర్మశబ్దము గలవారు శూద్ర క్షత్రియు లని పైశ్లోకము వేనోళ్ల జాటుచున్నది. ప్రాచీన