పుట:Andhrula Charitramu Part 2.pdf/305

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గణపతిదేవుడు వెలనాటిని జయించిన పిమ్మట క్రీ.శ.1238 దవ సంవత్సరము విషువ సంక్రాంతినాడు తనతల్లిదండ్రులకును గణపతిదేవ మహారాజునకును ధర్మార్ధము నాగులుప్పలపాడు గ్రామములో మల్లికేశ్వరాలయమును గట్టించి యాశివాలయమునకును, పూజారులకును, వైదిక బ్రాహ్మణులకును, నియోగి బ్రాహ్మణులకును, దేవస్థానము నౌకరు లయిన మంగలవాండ్రకును, బోగము వాండ్రకును వృత్తిక్షేత్రములను దానము చేసి ప్రఖ్యాతు డయ్యెను. ఇతనిభార్య మాడబావి. ఈమెయందు నీతనికి సింగళదేవుడు, సారంగపాణి దేవుడు, గోపాల దేవుడు నను మూవురు పుత్రులు జనించిరి.

సింగళదేవ మహారాజు.

   మాధవదేవరాజునకు బిమ్మట సింగళదేవమహారాజు ప్రభువయ్యెను.  తండ్రి వలెనె యీతడును చక్రనారాయణుడాదిగా గల బిరుదముల నన్నిటిని వహించెను. ఇతనిశాసనములు క్రీ.శ. 1247 వ సంవత్సరము మొదలుకొని క్ర్రీ.శ. 1254 దవ సంవత్సరమువ్ఱకు  గానిపించుచున్నది. ఈయనకు సోమరాజు ప్రధానిగ నుండెను.  ఒంగోలులోనున్న శ్రీమల్లినాధ దేవుని నిత్యవైవేద్యమునకై భూదానముచేసి వ్రాయించిన యెండ్లూరు శాసనములో "సమస్తరాజ్య ధరణ నిరూపిత మహామాత్యపద విరాజమాన మాహోన్నత ప్రభుమంత్రోత్సాహ ప్రభు మంత్రోత్సాహ శక్తిత్రయగుణసంపన్నుడును, బాహాసప్తారి నియోగాధిపతియును, సకల లక్ష్మీపతియును, సమస్తసేనాధిపతియును, పతికార్యధురంధరుండు" నని యీతనింగూర్చివ్రాయబడినది. సోమరాజునకు వెనుక మాయిదేవప్రెగ్గడ మహా ప్రధాని యయ్యెను.

శ్రీసారంగపాణీదేవ మహారాజు.

  ఇతడు పింగళదేవునకు జ్యేష్టసోదరుడును మాధవదేవరాజునకు ద్వితీయ పుత్రుడునై యుండి పింగళదేవునకు బిమ్మట ప్రభుత్వపదవిని వహిం