పుట:Andhrula Charitramu Part 2.pdf/295

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గల్లు మొదలుకొని మార్జవాడివఱకును గల తెలుగుచేశమునంతను బ్రతినిధి పరిపాలకుడై పరిపాలించెను. కడపమండలములోని పులివెందులతాలూకలోని మోపూరు మొదలుకొని మైసూరురాజ్యములో చింతామణితాలూకాలోని మిండిగల్లువఱకు గల ప్రదేశమునకు (7000 గ్రాములు గలది) మార్జవాడి లేక మహారాజపది యనునామము గలదు. మార్జవాడికి కైవారముకోట యని యొక శాసనమున నున్నది. ఈనాటికి వల్లూరుపట్టనము రాజధానిగ నుండెను. కాబట్టి రాజప్రతినిధిగ నుండిన గంగయసాహిణి కడప, కందమోలు, అనంతపురము, బల్లారి, నెల్లూరు, గుంటూరు మందలములకు సర్వాధ్లికారియై పరిపాలిచె నని యనేకశాసనములంబట్టి నిర్ధారిత మగుచున్నది.

                    గంగయసాహిణి కాయస్థుడు.
    నహారాజప్రతినిధియైన యీగంగయసాహిణి కాయస్థకులస్ధు డని కడప మండలములోని పుష్పగిరిలో నున్న యొక శాసనములో వ్రాయబడిన యీక్రింది శ్లోకమువలన దెలియుచున్నది.

        "యో గండపెండేరక నామధేయ:
         కాయస్థవరిశోద్భవకర్ణధారి:
         శ్రీగంగ సేనాపతి రస్య కాన్తా
         కాన్తిర్హిచూంశోరిన కౌలలాయ:"

             గంగయసాహిణి పూర్వచరిత్రము.
   గంగయసాహిణికిని మనుమసిద్ధి రాజునకును వైరము గలదని తిక్కన సోమయాజి విరచితమైన నిర్వచనోత్తరరామాయణములో

      "ఉ. రంగడుదారకీర్తి యగు రక్కెసగంగని బెంజలంబు మై
            భంగ మొనర్చి మన్మజనపాలుడు బల్విడి నాచికొన్న రా
            జ్యూంగములెల్ల నిచ్చి తన యాశ్రితవత్సల వృత్తి యేర్పడన్
            గంగయసాహిణిం బదము గైకొను బంచె బరాక్రమోన్నతిన్"

         అని పద్యమువలన బోధపడుచున్నది.