పుట:Andhrula Charitramu Part 2.pdf/290

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దానము చేసెను. భాండసేనాధిపతి భాండసేనను జయించినపిమ్మట కొండిపర్తి భాండసముద్ర మనిపేరు పెట్టి భాండసముద్ర మను నొకతటాకమున్ ద్రవ్వించి భాండేశ్వర్లింగమును బ్రతిష్టగావించి యున్నతమైన దేవాలయమును బ్రాకారము లను నిర్మింపించి సువర్ణకలశములను బెట్టించి యాదేవుని కైంకర్యనకై అనకుర్తి యనుఇగ్రామము నొసంగెను వీరును దుర్జయవంశజులమని చెప్పుకొన్నవారు గావున గమ్మనాటిరెడ్లలోనివారే యని చెప్పవచ్చును.

                      చాగిపోతరాజు - గుడిమెట్టరాజులు.
     చాగివారు కాకతీయచక్రవర్తులకాలమున గుడిమెట్లరాజధానిగ నందిగామ సీమను బరిపాలనముచేసిన సామంతమండలేశ్వరులుగ నుండిరి. చాగివారిలో వేఱొక  కుటుంబమువారు పల్నాడు పరిపాలించుచుండిరని పల్నాటి వీరచరిత్రమున జదివియున్నాము. పల్నాటిచాగివారు హైయయవంశజుల మయిన క్షత్త్రియుల మని చెప్పుకొనియుండుట మన మెఱుగుదుము. గుడిమెట్ల చాగివారు దుర్జ;యవంసజులని మనియు, మనుకులసంభవుల మనియు, జెప్పుకొని యున్నారు. దుర్జ;;యవంశజు లయిన రాజు లనేకులు విష్ణుసారోద్భ వులమైన చతుర్ధాన్వయులమని బాహాటముగా జెప్పికొనియున్నారు. అదియును గాక వీరలు కాకతీయ రాజబంధువులుగ గనుపట్టుచున్నారు. వీరి శాసనములందెచ్చటను కాకతీయులకు సామంతుల మని చెప్పికొని యుండ లేదు. గుడిమెట్టచాగివారిలొ గొందఱు మనుకులసంభూతుల మని చెప్పుకొని యుండుటచేత వారిసంతతివారు తమది సూర్యవంశమనియు, వసిష్ట గోత్రమని యు జెప్పుకొన నారంభించిరి. గణపతిదేవరాయలకాలమునం దుండిన చాగిపోత రాజు గోదావరిమండలములోని పెద్దాపురసంస్థానపు లయిన వత్సనాయవారికి మూలపురుషు డని యేనుగులక్ష్మణకవిప్రణీత మైన రామవిలాస్ మను ప్రబంధ మున వర్ణింపబడి యున్నది.

        "గీ.సహ్యజాతీరమునకు భూషణ మనంగ
            సిరులు కిరనగు గుడిమెట్టపురము దనప