పుట:Andhrula Charitramu Part 2.pdf/281

ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోని ఉయ్యూరుప్రగణాలోజేరిన ముదునూరు గ్రామములోని రామేశ్వర దేవాలయంలో నున్న యొక శాసనములో నీక్రిందిశ్లోకమునందు కాకతీయ కుండాంబ యీరుద్రదేవరాజునకు భార్య యైనటుల గానబడుచున్నది.

  "శ్లో. బుద్ధరాధిపసూమరుద్రనృపతి, శ్రీనాధవాటీశ్వరో
        యస్యా భూజ్జనకొస్యకాకతిమహాదేవక్షితీశాత్మజా
        కుండాంబా జననీ ద్విషర్గజహరే శ్రీమాధవక్ష్మావతే
        ర్దేనీత్వం సముపేత్య సంప్రతి మహాదేవీప్రసూతే సుతౌన్."

పైశ్లోకమున జెప్పబడిన మహాదేవియొక్క భర్త్రయైన మాధవనృపతికి శ్రీనాధవాటీశ్వరుడైన బుద్ధరాజుకొడుకు రుద్రరాజు తండ్రియనియు, కాకతిమహాదేవరాజుయొక్క కొమాఎర్తౌయైన కుండాంబ తల్లి యనియు, బోధ పడుచున్నది. ఇతర శాసనప్రమాణములనుబట్టి రుద్రదేవరాజునకు వివాహము చేయబదిన మహాదేవరాజుకొమర్తెపేరు మైలమ్మ యని మన మెఱింగి యున్నాము. కుండాంబకు మైలమ్మ యనునామాంతరము గలదేమో భావి పరిశోధనమునం దెకుసుజిబవలసి యున్నది. కాకతికుండాంబశాసనమును బట్టి శ్రీమహామండలేశ్వర రుద్రదేవరాజుయొక్క యెనమండ్రుకుమారులలో మాధవనృపతి యొక్క డని స్పష్టమగుచున్నది. కాకతీయరాజుబంధువు లైన యీమండలేశ్వరు లందఱును, పైవెలనాటి గణపతిదేవచక్రవర్తి దాడి వెడలి నప్పుదు జరిగిన యుద్ధములలో భాగస్వాములై యుండి యాచక్రవర్తికి జయము సమకూర్చించినవారుగా నుండు రనుటకు సందియము లేదు.