పుట:Andhrula Charitramu Part 2.pdf/274

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కోటకేతరాజు

      క్రీస్తుశకము 1182వ సంవత్సరమున శ్రీమన్మహామండలేశ్వరుం డైన కోటకేతరాజు ధాన్యకటకమునకు బ్రభువయ్యెను. ధరిణికోటరాజులలో నితడు సుప్రసిద్ధుడు. ఇతనిశాసనములు గుంటూరుమండలములో అమరావతి వేల్పూరు మొదలగు గ్రామములలో నున్నవి. ఇత డమరావతీశాసనములో దన్నుగూర్చి,
    
         "స్వస్తిశ్రీచతుస్పముద్రముద్రిత నిఖిలవసుంధరా పరిపాలక, శ్రీమత్త్రి నయనపల్లవప్రసాదాసారిత కృష్ణవేణీనదీ దక్షిణ షట్సహస్రావనీవల్లభ, భయలోభ దుర్లభ, చోళ చాళుక్య సామంతమదానేకప మృగేంద్ర, విభవామరేంద్ర, శ్రీమదమరేశ్వరదేవనివ్య శ్రీపదపద్మారాధక, పరబలసాధక, శ్రీధాన్య కటపురాధీశ్వర, ప్రతాపలంకేశ్వర, కభిగళ మోళడక్కె, బెట్టరగనెక్కె, గండరగండ గండభేరుండ, జగమెచ్చుగండ, నన్నిమార్తాండ నామాదిప్రశస్తిసహిత శ్రీమహామండలేశ్వర కోటకేత మహారాజులు" అని చెప్పుకొని యుండుటచేత నత డాకాలమున సుప్రసిద్ధుడై యుండవలయుననుటకు సందియ ముండబోదు. ఇంత ప్రఖ్యాతిగలుగుటకు గారణము లేకపోలేదు. వేంగీరాజప్రతినిధియై చాళుక్యరాజభవనమూలస్తంభమని ప్రసిద్ధిగాంచి రాజమహేంద్రవరం మొదలుకొని కాళహస్తివఱకు గల యాంద్రదేసమును బాలించిన గొంకరాజునకు కోటకేతరాజు మేనల్లుడుగ నుండెను. ఈగొంకరాజు వెలనాటి మొదటిగొంకరాజునకు మనుమడు. చాళుక్య చోడచక్రవర్తి యైనమొదటికులోత్తుంగునిచే బెంచుకొనబడిన కులోత్తుంగ రాజేంద్రచోడునికి బుత్రుదు.1 ఈరెండవ గొంకరాజు తనతోబుట్టువైన సబ్బమదేవిని కోటకేతరాజు తండ్రియైన బీమరాజునకిచ్చి వివాహము చేసెను. అప్పటినుండియు నీవంశమున కధికప్రఖ్యాతి గలిగినది. ఈసంబంధమును గూర్చి యమరావతిలోని కేతర్4ఆజుశాసనములలో నొకదానిలో,

1.ఆంధ్రులచరిత్రములోని ప్రధమభాగము335, 336 పేజీలలో జూచుకొనవలయును.