పుట:Andhrula Charitramu Part 2.pdf/272

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈధనంజయుని గొత్రంబున విఖ్యాతు లైన నరపతు లనేకులు పుట్టినట్లు పైశాసనమునందే వ్రాయబడినది. క్రీస్తుశకము పండ్రెండవశతాబ్దము ప్రారంభమున ప్రోలనాయకు డనునాతడు ధరణికోట కధ్యక్షుడై యుండెను.

                       ప్రోలనాయకుడు
       ఇతడు చాళుక్యచోడచక్రవర్తియైన కులోత్తుంగచోడునకు సామంతమండలేశ్వరుడై వెలనాటిని బరిపాలించుచున్న మొదటిగోకరాజు మంత్రు లలో నొక్కడుగా నుండెను. ఈగోంకరాజునకు ధనదుపురము రాజధానిగ నుండెను.1 ఈ పురమున్ ధనదుపుర మని మంచనకవి తన కేయూరభాహు చరిత్రమునందు వ్యవహరించి యున్నాడు. మఱియు నత డీపురమౌన్ దన గ్రంధమున నిట్లభివర్ణించి యున్నాడు.

   "సీ. పుష్పకవివహంబు భూమిపై నిలిచిన
            య ట్లంద మైన దేవాలయములు
        రూప్యాచలము బహురూపంబుల నటించు
            రమణ శోభిల్లు సౌధముల నెల్లు
       అలకాధిపతి నిధు లన్నియు వెలినీట
           విడిసినక్రియ బణ్యవీధికలును
      ధాత మెరిని మిమ్ముదఱిగివిఅచినమాడ్కి
           గనుపట్టు బహుతటాకముల సొంపు
గీ. నుపవనంబులు సరిసులు నొప్పచేయు
    చెఱకుదోటలు బ్రాసంగుచేలు మెఱయ
    నఖిలవిభంవంబులకు వెలనగుచు వెలయు
    ధనదుపురమున కెనయన ధనదుపురము


1.ఇదియే యిప్పటి గుంటూరుమందలములోని చందవోలుగ్రామముగా నున్నది. ఆంధ్రచరిత్రము ప్రేధమబారములో 330 పుటలో ధాన్యగటకము ధనపురం నొక్కటియే యని పొరబాటున వ్రాయబడినది.