పుట:Andhrula Charitramu Part 2.pdf/268

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము.

231

         బాదసేవకుఁడనై పరఁగినవాఁడ
         భుజముల ముద్రలు పూనినవాఁడ
         క్షుద్రమార్గుల నెప్డు చూడనివాఁడఁ
         బ్రాసాదజీవినై ప్రబలినవాఁడ
         జ్యేష్ఠపుత్త్రుఁ డనంగ జెలఁగినవాడఁ
         బుట్టితీ వానెన్కఁ బురుషోత్తమునకు"

అని నిశ్చయముగా బ్రత్యుత్తర మిచ్చెను. ఈపైవాక్యములనుబట్టి యితఁడు మాలవాఁ డనియు, బ్రహ్మనాయనిచేత నుపదేశమును బొంది శంఖచక్రాంక ధారియై బ్రహనాయనికి భక్తుఁడును బాదసేవకుఁడు నై బాలనాయఁడు జనింపక పూర్వమే బ్రహ్మనాయనిచేత బుత్త్రభావమునఁ బెంపఁబడె ననియు స్పష్ట మగుచున్నది. మాడుగుల బ్రహ్మరెడ్డి రేచెర్లబ్రహ్మనాయఁడు మొదలగువారికి విందుచేసినపుడు గొల్లవారు మొదలగువారుమాత్రమే గాక కన్నమనాయఁడు మొదలగు గోసంగులు గూడఁ బోయిరి. కన్నమనాయఁ డావిందునకుఁబోయి తన యిచ్చవచ్చిన స్థలమునఁ గూరుచుండె నని

     "గోసంగికన్నమ గుణములకుప్ప
       తనయిచ్చ యగుచోటఁ దనరఁ గూర్చుండె"

తమ వీరచరిత్రములోని వాక్యములవలన బోధపడుచున్నది. మఱియొక కాలమునందు ఆణెమువారియెదుట బ్రహ్మనాయఁడు గోసంగులనడుమ గూరుచుండి వారితోఁ గలచి భుజించె నని చెప్పఁబడినది. మాధవకులము పవిత్రమైనదిగా

           లములెన్నిటికైన గఱుతైనవారు
           వర పూసలలోని దారంబువలెను
           లసి భేదములేక మలయుచుండుదురు
           పగిలిచండాల మేమియు లేక
           రంగళంబులిట్టే మాధరశులము"

అని బ్రహ్మనాయఁడు నిశ్చయించి పలికె నని చెప్పఁబడినది.