పుట:Andhrula Charitramu Part 2.pdf/257

ఈ పుటను అచ్చుదిద్దలేదు

తన మామగారయిన గండుకన్నమనాయనియింటికేగెను. రాకరాక చాలాకాలమునకు వచ్చిన యల్లుని నత్తవారు పరమసంతోషభావముతో, బూజించిరి. అతండును గొన్నిదినంబులు తన వచ్చినకార్యమును మఱచి మదనవ్యాపారారతంత్రుడై యంత:పురంబును విడువక నిజసఖి యైన మాంచాలతో గ్రీడించుచుందెను. అపుడు పతివ్రతయు, సుగుణవతియు, సుందరయు నగునట్టిభార్యను విడిచి, వేశ్వతో గాలము బుచ్చుచున్నందులకు బశ్చాత్తాపమును బొందితన్ను దాను దూఱుకొనసాగెను. ఇట్లతావారింట బాలచంద్రుడు మాంచాలతోడి వినోదంబుల బ్రొద్దులు పుచ్చుచుండ నొకనాడు మాంచాల తన భర్త తా వచ్చిన పనిని మఱచియున్న వాడని యెంచి యిట్లనియ.

     "నాతో బెనంగిన నయమేమి లేదు
       కడువడిగలనికి గదలుడి మీరు
       కులవైరముదీర్చు గురుసాహసుండు
       పరికించి చూడ నెవ్వరు మీరుదక్క."

    ఇట్లు వచ్చిన కార్యమును దమ్మును మఱచి బాలనాయుడు పిఱికిపందయై స్త్రీలోలుడై యంత: పురంబున గ్రీడించుచున్న వాడని యాతని తమ్ము లాఱ్వురును మిక్కిలి కోపించి ఘనరౌద్రబావంబుతోడ కత్తులు దూసి వెడలిన కోపాగ్నిచే మా ఱెఱుంగక నేరునట్టి మదగజంబులరీతి గండువారింటిముంగల నిలిచి నగరు తల్లడమంద భీకరంబుగా వార్చి పెడబొబ్బ లిడిరి. అప్పు డతడాగ్రముతో గటారి వెఱికి తమ్ములపై నుఱికె అంత వారు బాలనాయుడు తమపై గనియ లజ్జాకరంబు లగు పోటుమాటలచే నొప్పించి సిగ్గుపడునటుల జేసిరి.
     అప్పుడు బాలనాయుడు తన తప్పును గ్రహింది యంత:పురబునకు జని తన చేతి కటారిని భాత్యచేతి కీయగా నామె నవ్వుచు భర్తనుజూచి--

    "రతిరాజ సౌందేర్య రణరంగధీర
      కమల బాంధవతేజ కరుణాలవాల