పుట:Andhrula Charitramu Part 2.pdf/256

ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్నహుమానము లొస్ంగే పని వీరచరిత్ర్ం నడుమ నభివర్ణీంపబడియున్నది.1 అనపోతు బాలనాయని ప్రవర్తనమును దెగడుచు వేశ్యావృత్తిని గూడ నీ క్రింది విధమున నిందించెను.

      "కామాంధకారంబు కన్నుల దట్టి
        కలధనమెల్ల్ బోగముదాని కిచ్చి
       చేసితి పాపంబు చెడ్డ వెచ్చంబు
       నిహపరదూరపుటీ నడకేమి
       సబ్బాయిపై బ్రేమ సర్వనాశంబు
       పోలిదానికి మ్రొక్కి సొమ్మెల్లనిచ్చి
       యిందఱ నడిగిన నేమి లాభంబు
       వారకాంతల రీతి వర్ణింపరార్
       బిడ్దలకొసగక ప్రియురాలి కీక
       చీమలుగూర్చిన చెలువునగూర్చి
       ధనవంతులగు వారి ధన మెల్లదోచి
       ముంజికాండ్రనుజేసి మురిపమడంప
       వ్యర్ధులై విటవృత్తి వసుమతి మీద
       బోయిరి బ్రతికెడు పొందికలేక
       యుర్విపై వేశ్యల కోలి యిచ్చుటలు
       వినలేదు కనలేదు వేడబం బిగ్ది"

      అని యిట్లు తన బ్రాహ్మణసోదరుడైన యనపోతరాజు చీవాట్ల పెట్టి మందలింపగా సిగ్గుచే దలవంచి ప్రత్యుత్తర మీయక తన యాభరణముల నెల్లను దీస్ది బీదలకు భిక్షకులకు, బ్రాహ్మణులకు, భట్టులకు, దానము చేసి

1. ఏమి హేతువుచేతనో వీరచరిత్రము నడుమ శృంగారభూయిష్టమైన వేశ్వాకధనమును జొప్పించి పదునాలుగేండ్ల బాలునకు వేశ్యాసంపర్కమును గలిగించుట కవికల్పన మని యూహింప వలయును; లేదా బాలనాయకుడు పదునాలుగేండ్లవాడుకాడని యూహింపవలయును.