పుట:Andhrula Charitramu Part 2.pdf/250

ఈ పుటను అచ్చుదిద్దలేదు

         జూచినవారలు చోద్యంబుగాగ
         బటువిక్రమాధ్యులు పల్నాటివీర
         వరులంచు బొగ?డుచు వర్ణించి పలుక
         మలిదేవభూపతి8 మంత్రిబ్రహ్మన్న
         కంసింప భూస్థలి కదలి రావేళ"

  ఇట్లు బ్రహ్మనాయుడు విశేషసైన్యములతో బయలువెడలి కార్యముపూడికల నికి వచ్చుమార్గమున ద్రిపురాంతకమున దండువిడిసి యచ్చటి త్రిపురాంత కేశ్వరున సందర్శించి యచ్చోటనుండి మరల బయలుదేఱి కర్యముపూడికి దక్షిణమున నాఱుమైళ్లదూరమున నున్న మేళ్లవగు జేరెను. అచ్చట నివసింది యుండి కార్యముపూడి రణరంగమును బరీక్షించుటకై బ్రహ్మనాయుడు తన ప్రియసేవకుండును మాలయు నగు కనుకులకన్నమనాయని నా యర్ధరాత్రంబున బంపెను. అతండును తన ప్రభువునాజ్ఞ శిరమున దాల్చి బయలుదేఱినవిధ మీక్రింద్ తెఱుంగున వీరచరిత్రమున వర్ణింపబడినది:-

"కరమున గుజ్జిరికడియముల్ మెఱయూ
  నేటైనపిడిఘంట నెమలిపోగలును
  ల్నల్లనిధట్టిని నయమొప్ప గట్టి
  యర్ధనరీఝుల్లకాదులు నమచి
  ఘోతభైరవగద కోరమీసములు
  నెగుభుజంబులుమించు నెఱజేరుగుడ్లు
  ఘనమైనదేహంబు కాలిపెండేరము
  వెరవైన భాకర వేషంబుతోడ
  గదలె గన్నమనీడు కదనభూమికిని"

      ఇట్లు కన్నమనాయుడు కార్యముపూడి రణరంగమునకుబోయి యచ్చట నున్నయొక యెఱుకలసానివలన నచ్చటి విశేషంబులనెల్ల నారసివచ్చి బ్రహ్మనాయనికి నివేదింపగా నతండు సంతోషించి నిజసైన్యములతొ నక్కడ