పుట:Andhrula Charitramu Part 2.pdf/243

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాలు స్వయంగా బయలు వెడలివచ్చి కనమదాసును నానావిధము లయిన దుర్భాషలను బలికెను. అందుపై మహోగ్రుడై కనమదాసు నాయకురాలిని జంప నుధ్యుక్తుడై పైబడ నామె తప్పించుకొని పాఱిపోయి సురక్షితముగా నంత:పురము బ్రవేశించెను. ఇంతలో బ్రహ్మనాయుడు తన ప్రియభృత్యుడైన కనమవీడు గానరానందున దిగులుజెంది తనప్రభువయిన నలగామరాజును దర్శింపవలయునన్న మిషతొ గురిజాలకు బైలుదేఱి వచ్చెను. నలగామరాజు, నరసింగభూపతి మొదలగు ప్రభువర్గమంతయు నాతని మిక్కిలి గౌరవముతో నాదరించిరి. ఆయనను నాయకురాలౌ అతనిని జంప నుపాయములు వెదకుచుండెను.

   అతడు వచ్చుమార్గమున నగాధమైన గొయ్యిత్రవ్వించి కనబడకుండ బైన గసవుచే గప్పించి మన్ను చల్లెను. ఆహారముతొ విషమునుగూడ బెట్టించెను. ఎన్ని యపకృతులు గావించినను బ్రహ్మనాయుడు బ్రతికియుండెను.
                    కోడి పందెములు.
     విందు లారరించిన తరువాత పభువు నతనియతిధియు వెలుపలికి వచ్చినప్పుడు నాయకురాలు కోడిపందెము లాడించుదుండుటను వీక్షింపసాగిరి. అప్పుడు నాయకురాలు గెలిచినకోడిని రాజుకోడి యనియును, ఓడిపోయినకోడి బ్రహ్మనాయనికోడి యనియును హెచ్చరించుచు వచ్చెను. బ్రహ్మనాయుడు దీనిని విని నాయకురాలివర్తనముమును నిందింప జొచ్చెను. ఇట్టి నాయకురాలి వర్తనము వారని మన:స్పర్ధను గలిగింప బ్రహ్మనాయుడు పగసాధింప బూనెను. ఓడిన ;యొకకోడి బ్రహ్మనాయుడని పిలువబడినతోడనే మరల జవసత్వములను బొంది నాయకురాలను బిరుదును వహించిన కోడినిమాత్రమేగాక యెదిరించిన వానినెల్ల జయుంచుచువచ్చెను. దీననంతయును జూచి నాయకురాలు సహింపజాలక కోపావేశపరవశురాలయి తనతో గొడిపందెము వేయవలసినదని కయ్యమునకు గాలుత్రివ్వెను. అందుల కత డంగీకరింపగా గొర్లపోరేఅటమునకై సవర్సన్నాహములు చేసి ఇరు పక్షముల కోడి పుంజులను యుద్ధమునకు సంసిద్ధములు గావింపబడియెను.