పుట:Andhrula Charitramu Part 2.pdf/240

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేడికోనగా నందుల కతండు శంకింపక యట్లే యని వర మిచ్చెను తరువాత వారలందఌరును గురిజాలకు మరలివచ్చిరి. కొన్నిదినములు గడిచినవెనుక నాయకురాలు వాగ్దానముప్రకారము ప్రభుత్వమును వశపఱుపవలసినదని యడిగెను. అత డట్లు కావించెను. అంతట నామె తనపరివారమున కుత్తరువులిచ్చి గ్రామములను దోపించి విశేషధనమును దెప్పించి నలగామరాజు కాళ్లముంగట గ్రుమ్మరించి 'మహాప్రభూ. ' సత్పరిపాలనము చేయగోరినపక్షమున నిట్లే ప్రతిదినము ధనార్జనము చేయవలయు ' నని హెచ్చరించుటయెగాక బ్రహ్మనాయుడు విశ్వాసవిహీనుడును, మోసగాడు నైయున్నాడని యతనిపై కొండెములు చెప్పెను. అతడు దేశముయొక్క యైశ్వర్యము నంతయు జూఱుకొన్నవాడనిగూడ నిందింపసాగెను. ఈమెవలలో జిక్కుకొని నలగామరాజు బ్రహ్మనాయనిపట్ల మన:స్పర్ధను వహించెను. బ్రహ్మనాయుడు ధనముగోలుపోయినవారికి ధనము నొసంగి యదరించుచు వారలమన్ననకు బాత్రుండగు చుండెను. ఏమయిననేమి? నలగామరాజాదు లీమెచేతిలోని కీలుబొమ్మలై యెటుద్రిప్పిన నటు దిరుగుచుండిరి. ఎట్లయిన నేమె? సవతితల్లి బిడ్డలపై నలగామరాజునకు గల ప్రేమ దొలగునటుల జేసెను. అంతటితో నూరకుందక వీరివిద్యాదేవపుత్రులయిన మల్లదేవాదులను జంపింప దివిరెను. దొడ్డనాయనిభార్య యగు శీలమ్మ ఘోరమైన మరణమునుండి యాబాలురను దపించి గాపాడి వారలను బ్రహ్మనాయనివశము చేసెను. బ్రహ్మనాయుడు వీరలను దిగ్గఱకుదీసి రాజ్యములో గొంతభాగము నిప్పించి గురిజాల విడిచి ఎట్టి మాచెర్ల యనుమట్టణమును గట్టించి వారల నచ్చటికి గొనిపోయి వారు బాలురైనందున వారలకు బదులుగా తానే పరిపాలనము చేయుచుండెను. మాచెర్లపట్టణము చంద్రవంక యను నొకయేటియొడ్డున గట్టబడియున్నది.

                        బ్రహ్మనాయని సంతానము.
      దొడ్డనాయనిపుత్రులలో బెద్దనాయుడు కృష్ణగందర్వునికూతురగు ముక్తులబాంబను బెండ్లాడె నని యిప్పటికి చెప్పియున్నాను. బ్రహ్మనాయని భార్య ఐతాంబ. ఈమెస ఈడమ్మయను నామాంతరము గలదు. పేర్నీని