పుట:Andhrula Charitramu Part 2.pdf/230

ఈ పుటను అచ్చుదిద్దలేదు

జేసెననియు, కళ్యాణపురిబిజ్జలునికొడుకు వీరసోమేశ్వరని కూతురును మలిదేవరాజునకిచ్చి పెండ్లిచేయబడెననియు చెప్పబడి యున్నది. హోసల రాజయిన రెండవ వెరబళ్లాణునినానుమును, వెలనాటి చోడగొంకరాజు నామమును ఉదాహరింపబడినవి. వీరందఱును గొంచెమించుమించుగా సమకాలెకులై యున్నారు. వీరిలో గోటబేతరాజు 1182 వ సంవత్సరమున బరి పాలనమువహించినవాడు గావున పల్నాటివీరులయుద్ధకాలమున నితనితండ్రి భీమరాజ్ ధరిణికోటలో బరిపాలనము సేయుచుండెను. బేతరాజుబ్రహ్మనాయని కడప రాయబారము గొనిపోయెను. బిజ్జలునికొడుకు వీరసోమేశ్వరుడు మృతి నొందినతరువాతనే పల్నాటియుద్ధము జరిగెనని చెప్పబడినందునన్, వీరసోమేశ్వరుడు 1176 వ సంవత్సరమువఱకు బరిపాలనము జేసినందునను, పల్నాటియుద్ధము 1176-1182 సంవత్సరములకు నడుమ జరిగె ననుట కేసందే హమునులేదు. ఇంత యేల? మొదటిప్రతాపరుద్రుడు నలగామరాజున ససైన్యమునంపె నని చెప్పబడియుండుటాచేత 1192 వఱకు బరిపాలనము చేసిన ప్రతాపరుద్రునితో బ్రహ్మనాయుడు సమకాలికుడనుట స్పష్టముగదా. 1202 దవ సంవత్సరమునాటికి బ్రహ్మనాయునితండ్రి యగు దొడ్దనాయుడనెడు దామనాయు డను మల్లానాయనికి సంతానమే లేకయుండగా బ్రతాపరుద్రునితో సమకాలికుడగు తనతాత యైన బేతినాయనితో బ్రహ్మనాయుడెట్లు సమకాలికు డయ్యెను? ఆయుద్ధమునాటికి గోడలితో గాపురముచేయుచున్నకొడుకుగూడ బ్రహ్మనాయనికి గలడు. అనగా బ్రపితామహుడు, పితామహుడు, మనుమడు, వయసువచ్చినమునిమనుమడు నేకకాలమున నున్నవారని చెప్పవలసి వచ్చును. ఇది యెంతయు నసందర్భముగా నున్నదికదా? బేతాళనాయుడు గణపతిదేవునివలన సత్కారములను బొందకపూర్వమే బ్రహ్మనాయుడు మొదటి బ్రతాపరుద్రునికాలమున జరిగిన పల్నాటియుద్ధములో విజయము గాంచినట్లు బోధయగుచున్నదిగదా? పల్నాటివీరచరిత్రములో బ్రహ్మనాయనితండ్రి దొడ్డనాయుడు యుద్ధమునాటికి జనిపోయె నని చెప్పబడియున్నది. 1208 దవ సంవత్సరములో నెఱ్ఱక్కసాని