పుట:Andhrula Charitramu Part 2.pdf/226

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గలిగి యనేక సంవత్సరాలుగా దనచే జోడింపాడుచు తన్ను బలి ఇచ్చి ధనము గైకొనుమని చెప్పనంతటి విశ్వాసపాత్రుని రేఛ డనువానిని క్షుద్రదేవతల ప్రీతికై సంహేరించె ననుమాట విశ్వసించుట కెంతమాత్రము వొప్పి యుండలేద్. ఎఱ్ఱక్కసానశాసనము నాటికి గణపతిదేవ్ని పరిపాలనము ప్రారంభమై పది సంవత్సరము లయ్యెను. ఈలోపలనే బేతిఫెడ్డి యను బేతాళనాయనికి గణపతిదేవునివలన సమ్మానములు గలిగి పైబిరుదములు వహింఛుట తటస్థమయ్యె నని చెప్పవత్తురేమో? అదియు విమర్శింతము 1202 దవ సంవసత్సరమున బేతిరెడ్డి కలంకరింపబడిన బిరుదములు 1202 వ సంవత్సరమున నామిరెడ్డిగూడ వహించియుండెను.వెలుగోటివంశచరిత్ర కారులు నామిరెడ్డి బేతిరేడ్డికన్న యని యూహించుచున్నారు. కాబట్టి పైకార్య ములకు బిరుదమ్లకు నెట్టిసంబంధము లేదు. నామిరెడ్డినామము బేతిరెడ్దికి నామాంతర మని చెప్పుటకు వలను గాదు. నామిరెడ్ది భార్య మైతాంబ యని చెప్పబడినది గాని యెఱ్ఱక్క యని చెప్పబడి యుండలేదు. వారముకొఱకు నామిరెడ్డి బేతిరెడ్డికన్న యనియే యొప్పుకొందము. అతడు వహించిన బిరుదములచేతను జ్యేష్ఠుడగుటచేతను 1202 వ సంవత్సరమున నామనగల్లు ప్రాంతదేశము నతడే పరిపాలించుచుండనని చెప్పక తప్పదు. అన్న పరిపాలనము చేయుచుండ తమ్మునికి గిరీటమునిచ్చె ననుట యసందర్భము గాదా. వాస్తవముచేత నామనగంటిప్రభువులు కిరీటధారులు గారు. కిరీటాధిపతులని యొకవేళ నంగీకరించినను జ్యేష్టుడు పరిపాలనము చేఉచుండగా గిరీట మొసంగెననుట ధర్మవిరుద్ధం. అప్పటికి నామిరెడ్దిగూడ మృతి నొంది యుండవచ్చునని చెప్ప సాహసింపవచ్చును. అట్లయినచో జ్యేష్టునిరాజ్యముతోగూడ కిరీటాదిరాజచిహ్నములు తమ్మునికి సంక్రమింపక మానవు. అట్టి కిరీటాది రాజచిహ్నములను వహించి యుండగా మరల గిరీటము నొసంగ నవసరము లేదు. ఎఱ్ఱక్కసానిశాసన నామె భర్తయొక్క వీర్యవితరణాదిగుణగణంబులు లభివర్ణింప బడియెనుగాని యతడు కిరీటాధిపతియని యభివర్ణింపబడి యుండలేదు. మఱియు