పుట:Andhrula Charitramu Part 2.pdf/218

ఈ పుటను అచ్చుదిద్దలేదు

లేడని చెప్పవలసివచ్చుచున్నది. ఎఱ్ఱక్కసాని పిల్లలమఱ్ఱిగ్రామములో ఎఱకేశ్వరుని బ్రతిష్టించి భూదానములను జేసను. రేచెర్లబేతిరెడ్డికి ఎఱ్ఱక్కసాని యందు జనించిన మల్లారెడ్డినిగూర్చి ఎఱ్ఱక్కసాని శాసనములో ని ట్లభివర్ణింప బడియెను.

"శ్లో. యస్యా: పుత్త్ర: ఫవిత్రోన్నతమతచరితోద్భూతసుఖ్యాతకీర్తి
      ర్మల ప్రోల్లాపితశ్రీర్వితతవిరతరణ శృస్త్రశాస్త్ర ప్రలభ:
     న్వేమోర్వీలూనయుద్దోర్భటపటుచటుల్లాఖర్వగర్వారివీర
    వ్రాతాస్యామ్బోజరాణిప్రవిహీతవిజయ శ్రీపరామ్బోజపూజ:"

     ఎఱ్ఱక్కసానికొడుకైన మల్లారెడ్డి పరిశుద్ధ మైన యుత్తమచరిత్రము చేత విశేషయశస్సును మహాసంపదలను బొంది దాతయై శస్త్రశాస్త్రమునుందు బ్రగల్భుడై రనరంగమునందు దనచే ఖండింపబడిన  శత్రువీరుల ముఖమలములచే విజయలక్ష్మీపాదముల నిర్పించినాడని పైశ్లోకమునకు దాత్పర్యము. ఇట్టి గుణవిశేషములచే నొప్పుచున్న పుత్రుడప్పట్కి యావన వయస్కుండై యుండవలనుగాని కేవలము బాలుడై యుండజాలడు. ఇతడుగాక మఱికొందఱు పుత్రులుండినయెడల వారలు పేర్కొనబడియే యుందురు. అట్టివారి పేరు లెవ్వరివియు బేర్కొనంబడియుండకపోవుటచేతను వారలకు మల్లారెడ్ది యనుపుత్రు డొక్కడే కలడని నిశ్చయింపవలసి వచ్చుచున్నది. రేచర్ల బేతిరెడ్డిని గూర్చి కాసమయమున గ్రహింపదగిన చరిత్ర మింతయే. బేతిరెడ్డి 1124 వ సంవత్సరమునకు త్యరువాత మృతినొంది యుండవలయును. 1196 వ సంవత్సరము మొదలుకొని మొదటి ప్రతాపరుద్రుని సోదరు డగు మహాదేవరాజు 1199 దచ్వ సంవత్సరమువఱకు బరిపాలనముచేసి యాసంవత్సరమున దేవగిరి రాజయిన జైత్రపాలునితొ జరిగిన యుద్ధమునందు మృతినొందెను. ఆమనగంటి ప్రభు వయిన బేతిరెడ్డికూడ మహాదేఫరాజుతొ యుద్ధమునకుబోయి మరణమునొంది యుండవలయును. ఈ రేచెర్లబేతిరెడ్డినిగూర్చి యనేకగాధలు చిత్రవిచిత్రములు గా బట్టులచే గల్పింపబడి పాటలు పద్యము లల్లబడి బేతాళనాయనివంశీయుల మని చెప్పుకొను