పుట:Andhrula Charitramu Part 2.pdf/190

ఈ పుటను అచ్చుదిద్దలేదు

జనించినవడనివ్రాయబడినది. మాధవశర్మ గాధ పండ్రెండవశతాబ్దప్రారంభ మునకే ప్రచారమునం దుండెనని యీశాసనమునుబట్టి దెలియుచున్నది. ఇట్లు భూదానములబొందిన యీజైనాలయమును అనుమకొందబ్రాహ్మణులు స్వాధీనము చేసికొని దుర్గయొక్క నామాంతరం మని నమ్మి పద్మాక్షీదేవి యను పేరుతో నర్చనాదికమును జరుపుచున్నారు. ఈయాలయము జైన్లనుండి బ్రాహ్మణులస్వాధీన మెప్పుడయ్యెనో దెలియరాదు. ఇయ్యది మొదటి ప్రతాప రుద్రునికాలమ్ననొ గణపతిదేవచక్రవర్తి కాలముననో బ్రాహ్మణుల యధీనమై యుండును. ఈశాసనమునుబట్టి యీపద్మాక్షి యాలయము మాధవవర్మ కాలమునుండియు శైవబబ్రాహ్మణుల యధీనమునం దుండెనని గాని, ఈపద్మాక్షీదేవ వరప్రసాదముననే సోమదేవరాజు మాధవవర్మ మొదలు గాలగల చాంద్రవంశపు రాజులను జయించి రాజ్యమేలినారని విశ్వసింపరాదు.

               ప్రోలరాజు తైలపదేవుని బంధించి విడుచుట.
     కాకతిప్రోలరాజు పుత్రు డైన మొదటి ప్రతాపరుద్రుని యనుమకొండ శాసనములో చాళుక్యచూడామణి యైన తైలపదేవునితో యుద్ధముచేసి క్షణములోబంధించిభక్తునియందుండెడి యనురాగముచేత విడిచిపుచ్ద్ఫె నని యీక్రింది శ్లోకములోజెప్పబడినది.

       "హస్త్యారోహణకర్మకగతిం చాళుక్యచూడామణిం
        శశ్వద్యుద్భనిబద్ధగహ్వరమతిం యుద్దే బటంధక్షణాత్
        శ్రీమతైలపదేవ మంబుదనిభ స్తంంబేరమస్థం క్షణాత్
        ప్రఖ్యాతోరిపురకంకఖండనవిధౌ భక్తానురాగాజ్జహౌ."

ఈశ్లోకమునం బేర్కొనంబడిన తైలదేవుడురాజ్యాధిపత్యమును వహించి కుంతల దేశమునుబరిపాలించిన్ తైలదేవచక్రవర్తిగాక యాపచ్చిమఛాళుక్య కుటుంబమున జనించిన మఱియొక తైలదేవుడై యుండవలయును. ఎందుచేత నన దైలపదేవచక్రవర్తి క్రీ.శ. 1127 వఱస బరిపాలనముచేసినట్లుగా శాసనాదొదృష్టాంతములు గనంబడుచున్నవి. క్రీ.శ.1162 వ సంవత్సరములో