పుట:Andhrula Charitramu Part 2.pdf/189

ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్తంభముమీదనె పైనజెప్పబడిన ప్రోలరాజుశాసనము గలదు. వీనినన్నిటిని బట్టి చూడ నిది మొదట జైనులచేతనె ప్రతిష్థింపబడినదిగా దోచుచున్నది. ఈయాలయములో బ్రతిష్ఠింపబడిన పద్మాక్షీదేవి జైనౌరాణగాధలలో వక్కాణింపబడిన యురువదినల్వురు శాసనమహాదేవుల్లో నొక్కెతెయై యుండవలయును. ఇరువదిరెండవతీర్ధంకరుని శాసనఉదేవియైన బంబిక దుర్గ యొక్క ప్రతిరూపమని భావింపబడుచున్నది. అట్లే పద్మాక్షి పార్స్వనాధునియొక్క శాసనదేవిగ నున్నది 1. కాబట్టి ప్రోలరాజుమంత్రి యైన బేతనప్రెగ్గడభార్యయగు మైలమ్మ యాకొండపైన యాలమున గన్నడములో "కడజాలయ" మనియెడి యంబిక నో పద్మావతినో ప్రతిష్టించియుండవచ్చునని యూహింపవచ్చును. తనకు జైనమతమునం దుండెడి ప్రేమచేతను భక్తిచేతను బుణ్యముకొఱకు కొండపైని కడలాలయబస్తిరి (వసతిని) బేతనప్రగ్గడభార్య యగు మైలమ్మనిర్మించె నని పైశాసనమునందే చెప్పబడినది. మైలమ్మ తండ్రై యగు బెతనప్రెగ్గడే తనస్వగ్రామమునంఉద్ బరిదేవాలయములను నిర్మించెననికూడ వ్రాయబడినది. ఈ మైలమ్మచే నిర్మింపబడిన కడలాలాయమునకు జాళుక్యవిక్రమాసంత్సరము 41 హేవలంబిసంవత్సర పుష్యబహుళ 30 సోమవారమున అనగా క్రీ.శ. 1117 వ సంవత్సరము డెసెంబరు 24 వ తేదీని శ్రీమన్మహామండలేశ్వర కాకతిప్రోలరాజు మైలమ్మ పేరిట నామెభర్తయైన బెతప్రెగ్గడ త్రవ్వించిన చెఱువ్క్రిందను బాడువపొలము రెండునుత్తరులను ఆ చెఱువునకు పడమటిప్రక్కను నల్లరేగడి పొలము నాలుగుమత్తరులను బీటిపాల మాఱుమత్తరులను ధారాపూర్వకముగా దానముఛేసి పైశాసనమును వ్రాయించెను. మఱియు నీశాసనమునందే శ్రీమన్మహామండలేశ్వర మేకరాజు కూచికెఱెచెఱవుకట్టక్రింద మొక నిత్తరు బాడుపొలమును దానికి సామీప్యమున బదిమత్తిరుల సామాన్యభూమిని దానము చేసినటుల వ్ర్రాయబడినది. ఈమండలేశ్వరు డయిన మేళరాజు మాధవవర్మవంశమున


1. 13 Burgess Page 46, note 2