పుట:Andhrula Charitramu Part 2.pdf/185

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పడమటిబుద్ధరాజు తోబుట్టువయిన యక్కాంబికకు వివాహ మయ్యెను. ఈ యక్కాంబిక పుత్రుడగు వెలనాటికులోత్తుంగఛోడగాంగేయగొంకరాజు పైజెప్పిన బుద్దరాజువశంశమున జనించిన జయాంబికను వివాహ మయ్యెను.1 శ్రీ మన్మహా మండలేశ్వరకాకతీయగణపతిదేవచక్రవర్తి తన ద్వితీయపుత్రికయైన గణపాంబను శ్రీధాన్యవతీఉరాధీశ్వరుండును ధనంజయగోత్రుండును చరుర్దకులజుండును మహా మండలేశ్వర కోటకేతరాజు మనుమడును మహామండలేశ్వర రుద్రరాజుకుమారుడున్ నైన మహామండలేశ్వర కోటనేతరాజున కిచ్చి మహావైభవముతో వివాహమున్ జేసెను.2 కాకతీయు లిట్లు చతుర్ధాన్వయ సంబవు లయిన కమ్మవారితో సంబంధబాంధవ్యములు నెఱపి యుండుటచేత వీరును చరుర్ధాన్వయసంభవులే యని నిశ్చయింపక తప్పదు. మఱియును బ్రతాపరుద్రచక్రవర్తికొదుకులలో నొక్కదు క్రీ.శ.1313 వ సంవత్సరమున గడపమండలములోని చెన్నూరిగ్రామమునకు దక్షిణపాడు నాగనాధుని దేవాలయముకడ వ్రాయించిన యొక దానశాసనములొ నతని నామమునకు "ర్తెడ్డి" యనుపదము చేర్చబడియుండుటచేత వీరు మొట్టమొదట రెడ్డి తెగలోనివారుగానే యుంది కమ్మవారితో సంబంధములుచేసి కమ్మవారయి రని యూహింపవలసివచ్చుచున్నది. ఇప్పటివలగాక యాకాలమునందు శూద్రులలో భేదము లంతగా బాటింబబడకుండెను గాని కాకతీయులపరిపాలన మునందును తరువాతను నీభేదము లభివృద్ధి నొందుటయే గాక కాకతీయ సామ్రాజ్యమస్తమించుటకు గారణములుగూడ నయ్యెను. ఈ విషయము లన్నియు సవిస్తరముగ రాబోవు ప్రకరణములలో వివరింపబడును.

                         త్రిభువనవల్ల్ కాకతి బెతరాజు.
     కాకతీయులు సూర్యవంశపురాజు లని యొక్కగణపతిదేవచక్రవర్తి శాసనము లయందుమాత్రము పేర్కొనబడియెను గాని యంతకు బూర్వము

1. No. 26 T.Sandavolu Inscription of Buddha.raja. 2. Epigrapia Indica Vol.III, page 94