పుట:Andhrula Charitramu Part 2.pdf/172

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ములను యోగవాగములను బ్రసాదించెనట ! అంతట నందుడు యోగవాగముల చే జనార్ధనస్వామిని సందర్శింప గలిగెనట ! ఆస్వామి నందునిబోనీక నిలిపి నృసింహస్వరూపంబుదాల్చి ప్రత్యక్షంబైనంత నందుడును జెక్కు చెదరక నిలిచి యుండ స్వామి సంతోషించి శస్త్రములొసంగి పొమ్మనగ సెలవుగైకొని యతడు కాంచీపురమున కేగి చోళేంద్రునికొమార్తెను వివాహముచేసికొని యటనుండి రామేశ్వరమున కేగి ధనుష్కోటిలో స్నానముచెసి నందపురమునకు విచ్చేసి యధావిధిగా జనమనోరంజకం బగునటుల రాజ్యపరిపాలనము సేయుచుండెనట! ఈ నందమహారాజూకు విజయపాలు డన్ రాజు జనియించెనట! విజయపాలునకు యశస్కాముం డయిన సోమదేవుడు పుట్టేను. ఇతడు శత్రుజనభయంకరుడై పరాక్రమవంతుడై దేవబ్రాహ్మణ భక్తిపరుడై కంధారమను పట్టణమును రాజధానిగ జేసికొని బ్రాహ్మణుల కనేకాగ్రహారములొసంగి ప్రఖ్యాతు డయ్యెను. ఇంతియగాక మంత్రికూటం, చిద్రాచలము, మొదలగు ప్రదేశములలో అసంఖ్యాకములయిన యావులమందలన్ జేర్చి వానిపోషకత్వమునకై అధికారులన్ గొంగఱను నియమించి విశేష భక్తిశ్రద్ధలతో బోషించుచుండెను.

                   కటకరాజు దండెత్తివచ్చుట.
     ఈసోమేశ్వరభూపాలుని విఅభవము నంతయు జరులవలన విని కటకపురాధీశ్వరుండయిన బల్లహుడువాని యైశ్వర్యమున్ జూఱ గొనవలయు నని బహుళసైన్యసమేతుడైకందారముపై దండేత్తివచ్చి గోదావరీప్రాంత ప్రదేశమున సోమదేవుని పశుగణంబులబొదివి గోపాలుల నదలించి మందలను దోలుకొనిపోవు సమయంబున గోసంరక్షణార్ధము నిలుపబడిన వీరభట వర్గమునకును బల్లహుని సైన్యములకును ఘోరయుద్ధము జరిగెను. ఆయుద్ధమున సోమదేవుని సైన్యంబున హతశెషులు కందారంబునకుం జని "ఓ రాజదేంద్రా! కటకపురాఢీశ్వరుండయిన బల్లహుని సైన్యమ్లు ధరణీ చక్రము సంచరించునట్లుగా సముద్దాంతంబులై గ్రక్కున నేతెంచి మన