పుట:Andhrula Charitramu Part 2.pdf/158

ఈ పుటను అచ్చుదిద్దలేదు

జాలనియు, వ్యాఘ్రలాంచనులనియు, భోగవతీపురధీశ్వరులనియు స్పష్టముగ వక్కాణింపబడియున్నారు. ఈసింధువంశముయొక్క మూలపురుషుడు సింధు నదీగర్భదేశముదలి అహిక్షేత్రపురమునందు ధారణేంద్రుడనునాగరాజునకు మానవరూపమున జనించిన పుత్రుడైయుండెనట

    అతడు జనించినపిమ్మట మొకవ్యాఘ్రముచే బెంపబడియెనట! అతడు కదంబరాజపుత్రికను బెండ్లాడుగా వారలకు మూవురుపుత్రులు కలిగి సింధురాజ వంశస్థాపనకు లైరి.  తరువాత ముప్పయొక్కరు రాజులు జనించి ప్రభుత్వము చేసిరి.  తరువాత సైంధవుడు; అటుపిమ్మట కష్రురాజు (కమ్మయరాజు) జనించెను. అతనికి సాగరాంబయందు పులికాలుడు జనించెను. పులికాలునకు రేవకాంబయందు నాగాదిత్యుడు జనించెను. నాఅగాదిత్యునకు పోలాంబయందు పోలయూసింధువు పుట్టెను.  వానికి ఖాండవమండలేశ్వరుని తనయ యగు బిజ్జల దేవియందు సేవ్యరారు పుట్టెను.1 ఈపైని పేర్కొనంబడిన పోలయ సింధురాజును వానికొడుకు సేవ్యరాజును చక్రకొట్యమండలేశ్వరుడైన జగదేక భూషణధారావర్షునసమసొమేశ్వరునకును సమాలికులైయున్నారు.  కాబట్టి ధారావర్షుడు పైనిజెప్పిన రాజవంశమునకు సంబంధించినవడై యుండవచ్చునని తోచుచున్నది.  మఱియును పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, మొదలగువారివలెనే యీనాగవంశరాజులును ఉత్తరహిందూ స్థానమునుంది దక్షిణహిందూస్థానమునకు వచ్చినవార మని చెప్పుకొను చున్నటుల బైనుదాహరింపబదిన భైరాన్ నుట్టి శాపమువలన బోధపడు చున్నది గాని, యితరాధారము లేవియును బరిశోధింపకుండ నీశాసనము లోని  గాధలను విశ్వసింపరాదు.
  ఈగజగదేక భూషణధారావర్షమహారాజునకు చంద్రాదిత్యు డను నాతడు సామంతుడుగ నుండెను.  ఇతడు తాను కరికాలచోడవంశమువడ ననియు, కాశ్వపగోత్రుడ ననియు జెప్పుకొనియుండుటచేత దెనుగుచోడుల తెగలోనివడుగ గనుబట్టుచున్నాడు.  ఇతనిశాసనముపైని  సింహలాంచనము

1.Ep, Ind. Vol.III. P.231