పుట:Andhrula Charitramu Part 2.pdf/157

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముట్టడించి యా దేశములోని యనేకగజయూధములను పట్టికొనిపోయెనని రాజేంద్రచోడుని శాసనములయందు జెప్పబడినది.1 వజ్రపురము మిక్కిలి పురాతన మైనపట్టణముగ గానిపించుచున్నది. క్రీస్తుశకారంభమున గావేరీ తీరమున మొరయూరురాజధానిగ ద్రావిడదేశమును బరిపాలించుచు సుప్రసిద్ధి గాంచియుండిన కరికాలచోడచక్రవర్తిపైని జెప్పబదిన వజ్రపురాధిపతితో సఖ్యము గలిగియుండె నని శిలప్పదికార మను ద్రావిడకావ్యమునందు జెప్పబడి యున్నది.2 జగదేకభూషణబిరుదాంచితు డగు ధారావర్షుని యొక్క పూల్ర్వుల చరిత్రము దెలియరాదు. ఇతనికుమారు డగుసోమేశ్వరుని కృష్ణపుర (Kruruspal) శాసనమున వంశావళి చెప్పబదియున్నదిగాని యాభాగము నందలి యక్షరములు శిధిలము లయిపోయినందున వంశావళి చక్కగా వనగాహముకాకున్నది. ఈధారావర్షునకు బూర్వమున నొక ధారావర్షుదు పేర్కొనబడి వానివంశమునం దీధారావర్షుడు జనించినటుల జెప్పబడియెను. కన్నడమండలములలోని రాజవంశములనుగూర్చిన చరిత్రమును వ్రాసిన డాక్టరు ఫీటుదొరగారు సింధుకులులను (సైందవులను) మూడు శాంఅలవారిని బేర్కొనియున్నారు. అందు మొదటిరెండుశాఖలవారును పశ్చిమచాళుక్య చక్రవర్తులకు సామంతులై యుండిరి. మొదటిశాఖ యెలుబర గిశాఖయందురు. బొంబాయిరాజధానిలో బీజపురమండలములోని గాగల కోటపట్టణమునకు బదిమైళ్లదూరమున నున్న ధైరాన్ మట్టి యనుగ్రామమున మహాసామంత మండలేశ్వరు డైన నాగాదిత్యుచే వ్రాయింపబడిన యొక శాసనమున నీసింధువంశోత్పత్తినిగూర్చిన యొక చిన్నగాధ పేర్కొనబడినది. ఈసైంధవులు నాగజాతివారనియు, అనంతుడు వాసుకి తక్షకుడు మొదలగు నాగరాజుల యొక్క ప్రతిబింబములను ధ్వజమునందుగల నాగధ్వ


1. South, Ind Inscriptions Vol.III. PP.132 and 140 and Vol. II. P.235

   2.The Tamils 1800 Years ago P.67; Silappathigaram. V.II, P.104