పుట:Andhrula Charitramu Part-1.pdf/48

ఈ పుట ఆమోదించబడ్డది

న్నది[1]. అచ్చట నొకరాత్రముగడపి వారు చిత్రకూటముకు వెళ్ళిరి. చిత్రకూటము ప్రయాగకు పది క్రోశముల దూరము మీద నుండెను.[2] ఇప్పటిలెక్కననుసరించి ప్రయాగకు చిత్రకూటము డెబ్బైయైదు మైళ్ళదూరమున ఉన్నది. ఇందువలన రామాయణములోని క్రోశమునకు నేడున్నరమైళ్ళు సరిగానుండునని మనమూహింపవలసియున్నది. ఈ చిత్రకూటముకు సమీపమున మందాకినీ యనునది యున్నట్లుగ జెప్పబడినది. ఇప్పుడును నా పేరుగలనదియే యాపర్వతముకడనున్నది. కనుక బ్రస్తుతము ప్రయాగపట్టణముకు బశ్చిమమున డెబ్బైయైదు మైళ్ళదూరమునున్న చిత్రకూటమను పర్వతమే రామాయణములోని చిత్రకూటమని నిశ్చయించుటకు సంశయింప బనిలేదు. అచ్చటి నుండి వారు మూవురు నాగ్నేయదిక్కునకు బోయి "అత్రిమహర్షి" యొక్క ఆశ్రమమున బ్రవేశించిరి. ఆశ్రమమనగా కొన్ని ముని పల్లెల సమూహమే కాని యొక పర్ణశాల కాదు.

ఆకాలమునందొకానొక మహర్షి నాశ్రయించి యనేకశిష్యులు సమీప ప్రదేశములజుట్టును గుటీరముల నిర్మించుకొని నివసించుచుండెడి వారు. అట్టి మునిపల్లెలనియు మహర్షి యొక్క యాశ్రమమని పిలువబడు చుండెడని. అత్రిమహర్షి యొక్క యాశ్రమము మిక్కిలి విశాలమైనదిగ నుండెను. ఇయ్యది ప్రస్తుతపురీనాప్రాంతముయొక్క దక్షిణసీమవరకు వ్యాపించెనని చెప్పవచ్చును. అత్రిమహాముని భార్య యనసూయ యనునామె. అనసూయకును సీతకును జరిగిన సంవాదము మిక్కిలి జ్ఞానప్రదమైనదిగ నున్నది. వీరిచ్చటనున్న కాలమున ౠషులు గొందరు వచ్చి తమకు రాక్షసుల వలన గలిగెడు బాధలను మాన్పుమని కోరగా రాముడొక మహారణ్యమున బ్రవేశించెనని తెల్పబడినది.[3] ఈ యరణ్యమే దండకారణ్యముగానున్నది. ఇది మిక్కిలి విస్తీర్ణమైన అరణ్యము.అసంఖ్య ఋ

  1. వాల్మీకి రామాయణము, అయోధ్యాకాండము 45సర్గము మొదలు 54 వరకు
  2. (అయోధ్యా 54-78) 3 (అయో 95)
  3. (618 అధ్యా 16-22)