పుట:Andhrula Charitramu Part-1.pdf/372

ఈ పుట ఆమోదించబడ్డది

నిచ్చి పుచ్చుకొనుచుండిరి. అందుచేత నొకనాటివారితో మఱియొకనాటివారికి సంబంధ బాంధవ్యములు లేకపోయినవి. అయినను భోజనప్రతిభోజనములకభ్యంతరము లేకయుండెను. అవియును గూడ శైవ వైష్ణవ స్మార్తద్వైతమతభేదములు ముదిరిన తరువాత గట్టువడినవి. ఆఱువేలనాడు పదునొకండవ శతాబ్దమున వ్యవహరములోనికి వచ్చినదగుటచేత నంతకు బూర్వము నియోగులులేరని గాని ఉన్నను వారువేఱని వీరువేఱని గాని యెంతమాత్రము భావింపరాదు. పల్లవులకాలముననే రాజకీయోద్యోగములను బడసియుండిన బ్రాహ్మణులు నియోగులని వ్యవహరింపబడుచుండిరని కుమార విష్ణునిశాసనము నిదర్శముగ జూపియుంటిమి. అయిననుపదియవశతాబ్దమునకు బూర్వమునుండిన రాజులవృత్తాంతములుగాని మంత్రులవృత్తాంతములగాని మనకు సంపూర్ణముగ లభింపనందున నా కాలపు నియోగులచరిత్రమంతయు వీనియోగులతోనే గూడియున్నది. కృష్ణదేవరాయల కాలమునాటికి నియోగులలో మఱికొన్ని శాఖాభేదము లేర్పడియుండుట చేత నీయాఱ్వేలవారంతకు బూర్వము విశేషప్రఖ్యాతి వహించి యప్పటికి మహోన్నతపదవులకు వచ్చియుండిరి గావున వీరిని నాఱ్వేలవారని పేర్కొనుచుండిరి. తరువాత వారు సహితము తమ గొప్పతనమును దెలుపుకొనుటకై యాఱ్వేలవారమని చెప్పుకొనుచుండిరి. విమలాదిత్యుని మంత్రియగు సబ్బియప్రెగ్గడ మొదలుకొని కృష్ణదేవరాయని మంత్రియగు సాళువతిమ్మరాజు వఱకుగల నియోగులలో విశేషప్రఖ్యాతి వహించినవాఱెల్లరు నొక్క కూటమిలోనివారేగాని భిన్నులుగారు. కృష్ణదేరాయలకడ మంత్రులుగనుండి రాజ్యతంత్రజ్ఞులయి ప్రభుత్వముల బంతులాడించి నట్లాడించి యాంధ్రదేశ నాటకరంగమున బ్రఖ్యాత పాత్రముల బ్రదర్శింపజేసిన వారీశాఖా బ్రాహ్మణులే. ఆంధ్రభాషా కోవిదులై యుత్కృష్టగ్రంథరచనము గావించి కవిబ్రహ్మలై కవి సార్వభౌములై తమకు దామె సాటియననొప్పి కీర్తిశేషులై చన్నవారీశాఖాబ్రాహ్మణులే. ఇట్లు రాజ్యపాలనా సా