పుట:Andhravijnanasarvasvamupart2.pdf/96

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పారిభాషిక పదములు

వ్యాప్తిసాధకానుమానమును గురించిన పారిభాషిక పదముల నీ క్రింద నిచ్చెదము. ఈ పట్టిక తర్కశాస్త్ర సంబంధమైన పాశ్చాత్య, పౌరస్త్య గ్రంథములను పెక్కింటిని చూచి సమకూర్పబడినది. నాగరీప్రచారిణీ సభవారి శాస్త్రీయపద పారిజాతమును, ( Glossory of Scientific Terms), ప్రొఫెసర్ రానడేగారి ఇరువదవ శతాబ్దాంగ్ల మహారాష్ట్ర కోశమును ( Pro. Ranade's Twentieth Century English - Marathi Dictionary ) కూడ నుపయోగించినాము. కొన్ని యింగ్లీషు పదములకు రెండు మూడు పర్యాయపదము లీయబడినవి. అట్టియెడ నీయనుమాన వ్యాసమునందు నుపయోగింపబడిన పర్యాయపదము మొదటను, మిగిలిన పర్యాయపదములు తరువాతను వ్రాయబడినవి.

Affirmative - భావ, విధాయక, అస్తిత్వబోధక

Affirmative proposition - భావవాక్యము

Between the horns of the dilemma - వికల్పజాలబంధము నందు, ఉభయసంకటములో, ఉభయతః వాళా రజ్జువు

Casuist - ధర్మశాస్త్రి, తర్కప్రవణుడు

Categorical proposition - నిశ్చయార్థక వాక్యము

Conclusion - సిద్ధాంతము, నిగమనము

Cocomitance - సాహచర్యము, సహభావము

Concomitant absence - వ్యతిరేకవ్యాప్తి

Concomitant presence - అన్వయవ్యాప్తి

Connotation - ధర్మార్థము, గుణసూచకము, జాత్యర్థము, సామాన్యాభిధానము

Connotative - గుణబోధకము, జతివిశిష్ట వ్యక్తి బోధకము

Contradiction - పరస్పర వైరము

Contradictory - పరస్పర విరోధి

Contraposition - రూపపదపరివర్తనము, నిషేధవ్యవస్థాపనము

Contrariety - వైరము, వైపరీత్యము

Contrary - వైర, విపరీత

Converse - పదపరివర్తన

Conversion - పదపరివర్తనము, ఉద్దేశ్యవిధేయపరివర్తనము

Copula - సంయోజకపదము, ( ఉద్దేశ్యవిధేయ ) సంయోజకము