పుట:Andhravijnanasarvasvamupart2.pdf/46

ఈ పుటను అచ్చుదిద్దనక్కరలేదు

అనావల్ - ఇది గుజరాతు దేశమున నివసించు బ్రాహ్మణుల తెగలలొ నొకదానికి పేరు. వీరికి దేసాయీ లనియు, మస్తాను లనియు మరిరెండు పేర్లు కలవు. దక్షిణ గుజరాతు దేశపు టాదిమ నివాసులు వీరు. బరోడా రాజ్యమునందలి నవసరీ జిల్లాయందు గల అనావల్ అను గ్రామము పేరునుబట్టి వీరి కీపేరు వచ్చినది.

ఈ యనావలులను గూర్చి యొక చిన్నకథ కలదు: రావణవధ యైపోయిన తరువాత శ్రీరాము డయోధ్యకు మరలి వచ్చుచు దారిలో అగస్త్యాశ్రమమునకు బోవలయు నని వింధ్యపర్వత ప్రాంతమున దిగెను. ఆయన అచ్చట రావణవధచే కలిగిన పాపమును బోగొట్టుకొనుటకై ప్రాయశ్చిత్త మొనరించుకొన దలచెను. కాని యచ్చట బ్రాహ్మను లెవ్వరును లేరు. అందరు భిల్లులే. అందుచే హిమాలయ ప్రాంతమున నుండి బ్రాహ్మణులను రప్పించెను. వారు రాము డిచ్చిన దక్షిన గొనకపోవుటచే వైశ్యధర్మ మనుష్ఠించుచు నుందురుగాక యని వారి నతడు శపించెను. ఆ బ్రాహ్మణుల సంతరివారే యీ యనావలులు.

ఇది మరియొక చిన్నమార్పుతోగూడ ఒక్కొక్కచో వ్యాప్తిలో నున్నది: వింధ్యపర్వత ప్రాంతమున బ్రాహ్మణు లెవ్వరును లేకుంటచే శ్రీరాము డచ్చటి భిల్లులనే విప్రులుగ జేసె ననియు, అయినను వారికి సంపూర్ణమగు బ్రాహ్మణత్వ మబ్బకపోయిన దనియు నీమార్పు.

బరోడాలోని నవసరీ ప్రాంతమున వీరు విశేషముగ గలరు. మొత్తము మీద బరోడాలో వీరి జనసంఖ్య ---- . వీరిలో దేసాయీలు, భధేలులు అను రెండు తెగల వారున్నారు. దేసాయీలు ఉత్తములు. ఈ రెండు తెగలవారికిని చుట్టరికము కలియదు.

అనాస (Pine apple - Ananas sativa) - ఇది యేకదళబీజకములలో జేరిన యొక ఫలజాతి. ' బ్రొమిలియేస ' కుటుంబమునందలిది.

అనాస మొక్క కుఱుచ ప్రకాండము గలిగి సుమారు -- అడుగుల యెత్తెదుగును. కాయ పుట్టిన వెనుక నీప్రకాండము నిడివిగ నెదిగి యాకాయను ఆకులమధ్యనుండి పైకి దేల్చును. మొక్క మొదటి నుండియు, ప్రకాండమునందునుగూడ పిల్కలు బయలుదేరును. అనాసమొక్క వేళ్లు సామాన్యముగ -- అం. కంటె లోతునకు గాని -- అడుగుకంటె దూరముగ గని వ్యాపింపవు. ఆకులు -- అం. వెడల్పుగలిగి -- అడుగుల పొడవుండును. నారగలిగి కొంచెము దళముగ నుండును. వానియంచులను వాడియైన ముండ్లుండును. కొనగూడ ముల్లుదేరి యుండును. ఆకు లించుక పసిమితో గాని, ఎఱుపుతో గాని చేరినయాకుపచ్చవర్ణము గలిగియుండును. పూవులు చిన్నవి. అవి గుండ్రముగ గాని, సమగోళాకృతిగ గాని యుండు నొక కృత్రిమఫలమునకు పైభాగమున నుండు ' కండ్ల ' లో నమరి యుండును. కండ్లపై రెప్పలవంటి దళము లుండును. పుష్పములు మిథునములు; పుష్పకోశము త్రిదళవలయము. ఆకర్షక వలయమున