ఈ పుట ఆమోదించబడ్డది

దగినదిగా దోచకపోవుటచే దన తండ్రికాలమునుండి కట్టింపబడుచున్న ఏకశిలానగరమునకు లక్షలకొలది ధనము వ్యయముగావించి బురుజులు, కోటలు, కందకములు, కొత్తళములు నిర్మించెను. రుద్రదేవుని యాస్థానమునందున్న కవులలో పాలకురికి సోమనాధుడు, గురు మల్లికార్ఝున పండితారాధ్యుల వారు, రామేశ్వర భట్టారకుడు లోనగు ప్రముఖులు పలువురుగలరు. రుద్రదేవుడు కవులతో నిష్టగోష్ఠులు గావించి వినోదించుటయేగాక తాను స్వయముగా గవిత్వమును చెప్పనేర్చి కర్ణాటసంస్కృతాంధ్ర బాషలలో నసమాన పాండిత్యము నార్జించి "విద్యాభూషణు" డను బిరుదము బడసెను. ఇంతియగాక రాజకీయధర్మములు, రాజవిధులు చర్చించు నీతిసారమును నొక పద్యకావ్యమును రచించి యాంధ్రభాష నలంకరించెను. ఇపు డాగ్రంథము లభింపకపోవుట సంతాపకరము. ఈయన యాస్థానమునందున్నటుల బై చెప్పిన గురుమల్లికార్జున పండితారాధ్యులవారు దండనాధుడుగ నుండి యాస్థానము నందు విద్యావినోదములలో బాల్గొనుచు శివస్తోత్ర గ్రంథముల బెక్కింటిని రచించెను. రుద్రదేవుని నడిమివయస్సున నీ పండితారాధ్యులు మరణించిరి.

పాలకురికి సోమనాధుడు మల్లికార్జున పండితారాధ్యుల వారి యనంతరము కొంతకాలమునకు రుద్రదేవుని యాస్థానమున బ్రవేశించి మృధుమధురమగు దనయాంధ్రకవిత