ఈ పుట ఆమోదించబడ్డది

ములు పరిశోధకులు కనిపెట్టుచున్నారు. ప్రత్యేక వ్యక్తిత్వము నిలువబెట్టు కొనుటకు సహస్రభంగుల సర్వతోముఖముల ఆంధ్రులు యత్నించుచున్నారు. ఈ శుభావసరమున గళాశాల లందును ఉన్నత తరగతులందును జదువుకొను బాలుర కాంధ్రదేశాభిమానము ఆంధ్రభాషాభిమానము గావించుట కుపరించుననియే యీ చరిత్రగ్రంథములు వ్రాయ నారంభించితిమి. ప్రమాణ గ్రంథముల నుండియు శాసనముల నుండియు నిం దుదాహరింప బడిన వీరచరిత్రములకు విషయ సంగ్రహణము గావించితిమి. మొదటి నుండి మే మభిమానముతో జేయు పరిశోధనము గూడ నీగ్రంథ రచనమున కెంతయు సహాయకారి యయ్యెను. కాకతీయ రుద్రదేవుడు, అనపోతనాయకుడు, సోదనాద్రి రెడ్డి మున్నగు వీరుల చరిత్రములకు వలయు జరిత్రాంశములు కొన్ని మేము చేయుచున్న నిజామురాష్ట్ర పరిశోధనమున లభించినవి. రెడ్డిరాణి పత్రికలో శ్రీ సురపురపు ప్రతాపరెడ్డి బి. ఏ., బి. ఎల్. గారు వ్రాసిన సౌమనాద్రి యను విలువగల వ్యాసమునందలి భాగములు కొన్ని యిందలి సోమనాద్రి చరిత్రము నందు జేర్చితిమిగాన వారికి బ్రత్యేకించి కృతజ్ఞత దెలుపుకొనుట యవసరము. దేశ మిపుడు పంచమ సంఘము నాదరించు చున్నది. అస్పృశ్యతా నివారణమునకు, పంచమోద్ధరణమునకు మిగుల బాటుపడు చున్నది. పూర్వము పంచమ సోదరు