ఈ పుట ఆమోదించబడ్డది

చుచున్నాడని ముక్తకంఠముతో బలికెను. సభ్యులందఱు నిర్విణ్ణులై యా సోమభూపాలకుని కరణాస్వరూపమును జూచి మిగుల విచారపడిరి. మాధవసర్మ సోమరాజును బరామర్శించి దైవవశమున నెంతవారల కేని యవస్థలు రాక మానవనియు గష్టసుఖములు వెనువెంట ననుభవింప దప్పదనియు దెలుపుచు, సిరియాలదేవి కందారరాజ్యమును వదలినది మొదలు నాటివఱకు జరిగిన కథయంతయు నివేదించెను. విచార విన్మయములతో సోమరా జాయంశము నంతయు నాలకించెను. సర్వ మాతని కింద్రజాలమువలె నుండెను. తన ధర్మపత్నిని మరల సందర్శింప గలనని గాని కారాగారమునుండి విముక్తుడను గాగలనని కాని సోమరాజు తలంచి యుండక పోవుటచే నాత డెంతయో యానందించి తన సుకృతమును దానె ప్రశంసించికొనుచు మాధవశర్మకు నమస్కరించి యర్ధాంగి నాదరించి తనయుని గౌగిలించుకొని తన్మయమున జాలసేపు మాటలాడక పోయెను. ఈదృశ్యమునంతయు గాంచుచున్న పౌరులు చిత్తరువు వలె నిలువబడిపోయిరి. పాదపీఠముచెంత బంధితుడై పడియున్న బల్లహుడు దీనస్వరముతో 'సోమరాజా! నీకు మిగుల ద్రోహము గావించితిని. సిరియాలదేవి! నీయెడ మిగుల నపచారము గావించితిని. మాధవవర్మా! నీ ప్రభావము నెఱుంగక ప్రతిఘటించితిని, నన్ను క్షమించుట కర్తవ్యము. పూర్వ