ఈ పుట ఆమోదించబడ్డది

దించి యొకానొక దినమున సైనికబలముతో బయలుదేరివచ్చి పశుపాలకుల నందఱ శిక్షించి వారల వృక్షమూలములకు బంధించి గోకదంబము నంతయు దన దొడ్డికి దోలించెను. కొన్నిగోవు లా సందడికి బెదరి కందారరాజ్యము త్రోవబట్టెను. పశుధనము నంతయు సైనికులు కటకము జేర్చికొని సరిహద్దులను దాటి మేపినందులకు బ్రతిక్రియ గావించితిమనియు, శక్తిసామర్థ్యములున్నచో నీ యాలమందలగొనిపోవచ్చుననియు సోమభూపాలునకు గటకేశ్వరుం డొక సందేశమును రాయబారులచే బంపించెను.

అంతకంటె ముందు గోరాజములు, తరువాత పశుపాలకులు, కందారమునకు జేరినపిమ్మట సోమరాజు పసుపాలకుల గాంచి పశువు లిటుల భిన్నభిన్నముగ రా గతమేమని ప్రశ్నింప గలరూపు నెఱింగించిరి. కటకేశ్వరుని దురంతము లిప్పటికి ఫలరూపమునకు వచ్చినవని సోమరాజు కోపదృష్టితో బ్రతిక్రియ యోజింపుచుండు సమయమునకు నతనిచే బంపబడిన రాయబారులు వచ్చి సందేశపత్రిక నొసంగిరి. సామోపాయముతో నిక ఫలములేదనియు సంగ్రామమునగాని కార్యఫలము తేలదనియు సోమరాజు నిశ్చయము గావించుకొని యా భటులకు గొలదికాలములో సంగ్రామమునకు వచ్చి గోకదంబముతోబాటు గటకేశ్వరునిగూడ బంధించి తేనున్నాడనని ప్రత్యుత్తరము వ్రాసి యొసంగి సైనికుల