పుట:Andhraveerulupar025958mbp.pdf/104

ఈ పుట ఆమోదించబడ్డది

బంగారముగా మాఱుచుండెను. వర్తకున కీపసరు చిక్కనీయక హరించి దీనిసహాయమున ధనము విశేషముగా నార్జించి రాజ్యము స్థాపింపనెంచి పసరుబరిణెమూటను దనగృహములో దాచి పసరుమూట తొలుత వర్తకుడుంచిన గృహమునకు అల్లాడరెడ్డి నిప్పుపెట్టెను. గృహము కాలిపోవుట చూచి వైశ్యుడు పరుగెత్తుకొనువచ్చి తాను సేకరించిన పసరుమూటగూడ నందేకాలిపోవుచున్నదని తలంచి వింధ్యాద్రికేగి మహాయోగుల నాశ్రయించి తానార్ఝించిన దివ్యరసము తగులబడిపోవు చున్నందులకు విచారపడి తానును అగ్నిహోత్రమునంబడి మరణించెను. గతమునకు అల్లాడరెడ్డి వగచి నిదురింప రాత్రి వేళవర్తకుడు కలలోనికివచ్చి "రెడ్డిదొరా! నీకు లభించిన పరుసవేదితో ధనమునార్జించి దేవళములు కోటలుగట్టి పరోపకారివై జీవింపుముగాని యందొక కాసునేని స్వయముగా నుపయోగించు కొనకుము. చిరకాలము పెద్దలసేవించి వడసిన స్పర్శ వేది అదృష్టవంతుడవగుటచే సులభముగా నీకు లభించినది. నాపేరు వేమన్న. నేనింత మహోపకారము నీకు గావించితినిగాన నీసంతతి కంతకు నా వేమనామము పెట్టుము." అనిచెప్పెను. అల్లాడరెడ్డి అందుల కియ్యకొని యాధనమును గోటలు, పేటలు గట్టించి ప్రజోపయోగముగా వినియోగించెను. ఈ కథ కొండవీడు, కొండపల్లి, ధరణికోట ప్రాంతములలో