ఈ పుట ఆమోదించబడ్డది

పరిస్థితులు గమనించి, కర్తవ్యము తోచక విజయము నొందుటకు జతురుపాయములలో నేదేని యవలంబించుట యుక్తమని కర్తవ్య నిర్ణయమునకుం దనకాప్తుడగు తిమ్మరుసు మంత్రిని గోరెను. పరిస్థితులన్నియు నెఱిగిన మహాయోధుడగు తిమ్మరుసుమంత్రికి గటకసామంతులను జయించుటకు సరియగు నుపాయ మేదియు గోచరింప దయ్యెను. భేదోపాయము దప్ప విరోధులను సాధించుటకు వేఱొక యుపాయము లేదని తిమ్మరుసుమంత్రి నిశ్చయించి వెరవూహించెను.

కటకరాజగు ప్రతాపరుద్రగజపతిరాజ్యమునకు బ్రతి నిధులుగనుండి బలభద్రపాత్రుడు, దుర్గాపాత్రుడు, భీమపాత్రుడు, ముకుందపాత్రుడు, భీకరపాత్రుడు, బేరుపాత్రుడు, రణరంగపాత్రుడు, ఖడ్గపాత్రుడు, అఖండలపాత్రుడు, మురారిపాత్రుడు, వజ్రముష్టిపాత్రుడు, తురంగ రేవంత పాత్రుదు, గజాంకుశపాత్రుడు, అసహాయపాత్రుడు, మృగేంద్రనోద్యుడు, విజయపాత్రుడు అనువారు ఓడ్రదేశమును పరిపాలించుచుండిరి. వీరందఱు ప్రతాప రుద్రగజపతి -------- సంగరమునకు దలపడిరి. కృష్ణరాయల సైన్యముకంటె బాత్రుల యధీనమందున్న సైన్యమె యెక్కుడుగ నుండెను. పైగ దన సైన్యము నిరాధారమగు బహిరంగ ప్రదేశమున నిలిచి పోరాడుటయు నపాయకరము. వెనుకకు మరలిన బరాక్రమమునకు లోపము. ఈ స్థితిగతులలో