ఈ పుట ఆమోదించబడ్డది

భూపాలుని దగ్గరకుబోయి తనకష్టములనెల్ల నెఱింగించి పాలేటి తీరమునగల బీళ్లు కొంతకాలము పశువులు మేపుకొనుటకు బుల్లరికి దీసికొనెను. పాలేటితీరమున గాటమరాజు కొన్నాళ్ళు నివసించి పశుగణమును బోషించుకొని కాలము గడుపుచుండు నంతలో ఎఱ్ఱగడ్డపాటినుండి కొందఱు గొల్లలువచ్చి వర్షములు కురిసినవనియు దేశము సుభిక్షముగా నున్నదనియు బశువులకు గూడ మేతగలదనియు వర్తమానము చెప్పిరి. కాటమరాజు ఆవార్త విన్నంతనె మిగులసంతసించి గంగమ్మకు జాతరులుచేయించి పరిమితివఱకు బశువుల మేపుకొనలేదు గాన మనుమసిద్ధికి మనము పుల్లరినీయ నవసరములేదని తమలోదాము నిశ్చయించుకొని యాదవులను బశువులను వెంటబెట్టుకొని పోవుచుండ మనుమసిద్ధిభటు లడ్డగించిరి. వారల దిరస్కరించి యాదవులు తమగ్రామము వెడలిపోయిరి. భటులవలన మనుమసిద్ధి యీవర్తమానము విని మండిపడి యాదవుల దురాగతమున కేవగించి అన్నము భట్టు అను నొక బ్రాహ్మణుని కాటమరాజువద్దకు పుల్లగి యొసంగుడని కోరుటకు బంపెను. యాదవులు పుల్లరి నీయవలసిన యవసరములేదనియు, గొలదికాలమె పశువులను మేపితిమిగాన నీయక పోవుటయె ధర్మమనియు, రాయబారములకు లొంగి కనకవర్షము గురిపించుటకు గొల్లలు పిచ్చి వాండ్రుకారనియు నందఱపక్షమున కాటమరాజు వర్తమానము చేసెను. యాదవులను వంచింపకున్న లాభములేదనియు పుల్లరి విడిచిపెట్టితిమేని పౌరులకు గూడ