ఈ పుట ఆమోదించబడ్డది

యైన విజయాదిత్యుడు బలవంతుడై రాజకీయోద్యోగులను సైనికులను లోగొని యక్రమముగా భ్రాతృరాజ్యము నాక్రమించెను. కులోత్తుంగచోడుడు రాజ్యభ్రష్టుడై పినతండ్రిని సాధించి నిజ రాజ్యము నెటుల లోగొనవలయునా యని తీవ్ర యత్నములు గావించుచు సైనికబలమును సమకూర్చు చుండెను. విజయాదిత్యుడు ప్రసిద్ధ పరాక్రమశాలి కాకపోవుటయు, గులోత్తుంగుడు సైన్యమును జీలదీయుచుంటయు గమనించి చిరకాలమునుండి వేంగిదేశమును గబళింప వలయునని ప్రయత్నించుచున్న పశ్చిమ చాళుక్యులలోనివాడగు (నాఱవ) విక్రమాదిత్యుడు అమితసైనిక బలముతో గృష్ణా గోదావరీ నదులదాటి రాజమహేంద్రవరముపైకి దండయాత్ర కేతెంచెను. స్వదేశము పర రాజాక్రాంతముగా నున్న చనియు నిపు డూఱకయున్నయెడల వేంగిరాజ్యమునకు మనకు బ్రాప్తము తీరుననియు గులోత్తుంగచోడరాజు నిశ్చయించి పశ్చిమచాళుక్యుల నెదిరించెను. ఉభయపక్షములకు గౌతమీ తీరమున భయంకరసంగ్రామము జరిగెను. కడకు బశ్చిమ చాళుక్యుడగు విక్రమాదిత్యుడు ఓడిపోయెను. తన రాజ్యము సరిహద్దులవఱకు బశ్చిమచాళుక్యరాజును గులోత్తుంగచోడుడు తరిమి వేసి వెనుకకు మరలి తన రాజ్యమునకు జేరి యంతవఱకు దనకు వ్యతిరేకముగ రాజ్యమేలుపినతండ్రియగు విజయాదిత్యునే తనకు ప్రతినిధిగా వేంగిరాజ్యము బాలించు