పుట:Andhraveerulupar025903mbp.pdf/143

ఈ పుట ఆమోదించబడ్డది

మహావృక్షమై దుర్భేదమై ఫలవంతమైనది. మహాత్ముల జీవితముల లోని ధర్మ రహస్యముల గ్రహించుటకు దివ్యదృష్టి కావలెననుట కీ యక్కన్న మాదన్నల చరిత్రమె ప్రమాణము. భద్రాచల రామదాసను పరమభక్తుని పవిత్ర చరిత్రము ఎఱుంగని యాంధ్రుడు లేడు. రామదాసు మొదటిపేరు గోపన్న. ఈయన అక్కన్న మాదన్నలకు మేనల్లుడనియు దానీషాకు జెందవలసిన ధనమును జేర్పక హరించుటచే జెఱసాలలో నుంచిరనియు నీయన భద్రాచలమున దాశీలుదారుగా నున్నప్పుడు రామాలయము గట్టించెననియు మనము వినియున్నారము. రామదాసు వంటి భక్తునకు మేన మామయగుట గూడ అక్కన్న మాదన్నల ప్రశస్తి కొక సాదనము.


సంపూర్ణము.